ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Dharmana Vs YSRCP: వైవీ సుబ్బారెడ్డికి ధర్మాన స్ట్రాంగ్ వార్నింగ్.. తంతా అంటూ..!

ABN, Publish Date - Feb 26 , 2024 | 10:02 AM

AP Elections 2024: ‘‘ఎవడో సుబ్బారెడ్డి అంట.. కడప నుంచి వచ్చి భూములు దొబ్బేస్తామంటున్నాడు’’ అంటూ వైసీపీ సీనియర్ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డిపై మంత్రి ధర్మాన ప్రసాద్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మాన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సొంత పార్టీ నేతలపైనే మంత్రి ఇలాంటి కామెంట్స్ చేయడం వైఎస్సార్సీపీ నేతల్లోనూ కలవరం రేపుతోంది.

శ్రీకాకుళం, ఫిబ్రవరి 26: ‘‘ఎవడో సుబ్బారెడ్డి అంట.. కడప నుంచి వచ్చి భూములు దొబ్బేస్తామంటున్నాడు’’ అంటూ వైసీపీ సీనియర్ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డిపై మంత్రి ధర్మాన ప్రసాద్ రావు (Minister Dharmana prasadrao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మాన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సొంత పార్టీ నేతలపైనే మంత్రి ఇలాంటి కామెంట్స్ చేయడం వైఎస్సార్సీపీ నేతల్లోనూ కలవరం రేపుతోంది.

ఇంతకీ ధర్మాన ఏమన్నారంటే..

ప్రజా ప్రతినిధులు అవినీతికి దూరంగా ఉండాలని, ఒకరి ఆస్తి కోసం కక్కుర్తి పడే మనస్తత్వం ఉండకూడదని, అయాచీతంగా దోబ్బేయాలనుకోకూడదని మంత్రి ధర్మాన ప్రసాద్ రావు హాట్ కామెంట్స్ చేశారు. నాయకుడు అవనితీకి పాల్పడకూడదని.. ఎవరు చేస్తామన్నా చేయనివ్వకూడదన్నారు. ఈ విధానాన్ని కచ్చితంగా తాను పాటిస్తానని తెలిపారు. శ్రీకాకుళానికి తాను చేసిన అభివృద్ధి ఎవరూ చేయలేదన్నారు. ‘‘కడప నుంచి ఎవడో సుబ్బారెడ్డి వచ్చి.. నేను భూములు దొబ్బేస్తామన్నాడు. నువ్వు ఎవడివి..? శ్రీకాకుళం నీ.. అబ్బసొమ్ముకాదు.. తంతా పొమ్మన్నాను. వచ్చిన వాడు ఏ పార్టీ అనేది చూడను. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ అజమాయిషీ చేస్తామనుకుంటారు. అలాంటివి అవమానంగా భావిస్తా. శ్రీకాకుళంలో వనరులున్నాయనే పక్క జిల్లాల నుంచి వచ్చేస్తున్నారు. ఇలా వదిలేస్తే రౌడీలమయం అయిపోతుంది. రౌడీల చేతిలోకి వెళ్లిపోతుంది. మిగతా ప్రాంతాలు ఇలానే పాడై పోతున్నాయి. ప్రశాంతంగా పట్టణాలు ఉండాలి. దశాబ్దాలుగా.. శ్రీకాకుళం ప్రశాంతంగా ఉండాలనే చూస్తున్నా. ఇన్ని చేసినా నేను పనికి రాకపోతే.. మీ (నియోజకవర్గ ప్రజలు) ఇష్టం. విజ్ఞతతో ఆలోచించండి. మీ అభిమానంతోనే గెలుస్తూ వస్తున్నా. జిల్లాలో ఎక్కడైనా నేను గెలుస్తా.. కానీ శ్రీకాకుళంలో వేరేవారు గెలవరు. మిగతా వారు కనీసం అభివృద్ధి కూడా చేయలేరు. గెలిస్తే శక్తివంతంగా ఉంటా.. ఓడితే స్నేహితుడిగా ఉంటా’’ అంటూ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు వ్యాఖ్యలు చేశారు.

ఇదేనా అసలు సంగతి..?

అయితే ధర్మాన తన కుమారుడికి వైసీపీ టికెట్ ఆశించగా.. అందుకు వైవీ సుబ్బారెడ్డి అడ్డుపడ్డారనే వార్తలో గతంలో చాలానే వచ్చాయి. కుమారుడికి సీటు విషయంలో పార్టీపై అసంతృప్తితో ఉన్న మంత్రి.. సుబ్బారెడ్డిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయండం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 26 , 2024 | 04:25 PM

Advertising
Advertising