ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Vasantha..Yarlagadda:విజయవాడకు అటు ఇటు.. ఇద్దరిది ఒకటే దారి

ABN, Publish Date - Apr 11 , 2024 | 05:09 PM

నిన్ను రైటు అనుకుంది నేడు రాంగ్ అవుతుంది... నేడు రాంగ్ అనుకున్నది రేపు రైట్ అవుతుంది. ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మైలవరం, గన్నవరం నియోజకవర్గాల్లో ఎన్నికల బరిలో నిలిచిన టీడీపీ అభ్యర్థుల విషయం ఇదే జరుగుతుందని ఓ చర్చ అయితే వాడి వేడిగా సాగుతోంది.

Yarlagadda Venkata Rao, Vasantha Krishna Prasad,

నిన్ను రైటు అనుకుంది నేడు రాంగ్ అవుతుంది... నేడు రాంగ్ అనుకున్నది రేపు రైట్ అవుతుంది. ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మైలవరం ( Mylavaram assembly constituency), గన్నవరం నియోజకవర్గాల్లో (Gannavaram assembly constituency) ఎన్నికల బరిలో నిలిచిన టీడీపీ అభ్యర్థుల విషయం ఇదే జరుగుతుందని ఓ చర్చ అయితే వాడి వేడిగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో మైలవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వసంత కృష్ణ ప్రసాద్ (Vasantha Krishna Prasad, బరిలో దిగారు. గన్నవరం టీడీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావ్ (Yarlagadda Venkata Rao) పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరు గత ఎన్నికల వేళ.. అంటే 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా వసంత కృష్ణ ప్రసాద్ గెలుపొందారు.

AP Elections 2024: ఇక మంచి రోజులు!

కానీ గన్నవరం నుంచి బరిలో దిగిన యార్లగడ్డ వెంకట్రావ్ మాత్రం ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత యార్లగడ్డ మీద గెలిచిన వల్లభనేని వంశీ.. జగన్ పార్టీలోకి జంప్ కొట్టేశారు. దీంతో ఒకే నియోజకవర్గంలో.. అదీ ఒకే పార్టీలో.. రెండు గ్రూపులుగా ఏర్పడాయి. ఒకటి వెంకట్రావ్ వర్గం అయితే.. మరొకటి వంశీ వర్గంగా ఏర్పడాయి. దీంతో ఆయా గ్రూప్‌ల మధ్య ఆదిపత్య పోరు మొదలైంది. దీంతో ఆ పంచాయతీ కాస్తా తాడేపల్లి ప్యాలెస్‌ను సైతం తాకింది. దాంతో ఆ పార్టీ పెద్దలు సైతం వంశీ వర్గానికే కొమ్ముకాయడం మొదలు పెట్టారు. ఆ విషయం అర్థమైన యార్లగడ్డ వెంకట్రావ్.. జగన్ పార్టీని వీడి టీడీపీలోకి వచ్చేశారు. దీంతో గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జీగా యార్లగడ్డను ఆ పార్టీ అధిష్టానం నియమించింది.


మరోవైపు మైలవరం నుంచి గత ఎన్నికల్లో వసంత కృష్ణ ప్రసాద్‌ గెలిచారు. ఆ తర్వాత.. వసంత కృష్ణ ప్రసాద్‌కు, మైలవరం నియోజకవర్గం వాస్తవ్యుడు, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌కు మధ్య నిత్యం వార్ నడుస్తునే ఉంది. ఈ పంచాయతీ సైతం తాడేపల్లి ప్యాలెస్ దాకా వెళ్లింది. ఇద్దరు కూల్‌ కూల్‌గా ఉండాలంటూ ఆ పార్టీ పెద్దలు ఆదేశించినా.. ఈ రెండు వర్గాల మధ్య పోరు కాస్తా శృతి మించడంతో.. పార్టీలోని అందరిని టెన్షన్ పెట్టేది.

Inter Results: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపే ఇంటర్ రిజల్ట్స్.. పూర్తి వివరాలివే..

అదీకాక మైలవరం నియోజకవర్గం నుంచి బరిలో దిగాలని జోగి రమేష్ చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలోనే వసంతకు ఆయనకు మధ్య లడాయి పడిందనే ఓ ప్రచారం సైతం మస్త్‌గా సాగింది. ఇక ఎన్నికల వేళ.. వసంత కృష్ణ ప్రసాద్‌ను పక్కన పెట్టి.. ఆ టికెట్ మరొకరికి ఇవ్వాలని ఆ పార్టీ అగ్ర నాయకత్వం నిర్ణయించింది. దాంతో వసంత కామ్ అయిపోయారు. అనంతరం ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలనుకొంటున్నట్లు ఆయన ప్రకటించేశారు. అయితే ఆ తర్వాత చోటు చేసుకున్న వరుస పరిమాణామాల నేపథ్యంలో ఎన్నికలకు ముందు వసంత టీడీపీలో చేరిపోయారు.


Chandrababu: ముస్లింలకు జగన్‌రెడ్డి చేసింది ఏమిటి?:

దీంతో మైలవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వసంత కృష్ణ ప్రసాద్‌ బరిలో దిగారు. అయితే గతంలో ఈ ఇద్దరు ఒకే పార్టీ నుంచి పోటీ చేయడం.. ఒకరు గెలువడం మరొకరు ఓడిపోవడం జరగింది. కానీ రేపు జరగనున్న ఎన్నికల్లో ఈ ఇద్దరు టీడీపీ నుంచి బరిలో నిలిచి... గెలుస్తారనే ఓ చర్చ సైతం సాగుతోంది. అదీకాక వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన ఈ అయిదేళల్లో ఏం చేశారో.. ఎంత చేశారో ప్రజలందరికీ తెలిసిందేనని ఓ చర్చ సైతం సాగుతోంది.

Varla Ramaiah: ఆ ఇద్దరి చేతగానితనం వల్లే పోలీసులకు ఈ దుస్థితి

జగన్ ప్రభుత్వంపై ఏర్పడిన వ్యతిరేకతే.. వీరిద్దరికి ప్లస్ అవుతుందని.. దీంతో వీరి గెలుపు నల్లేరు మీద నడకే అవుతుందని ఓ చర్చ సైతం సాగుతోంది. మైలవరం, గన్నవరం ఈ రెండు నియోజకవర్గాలు విజయవాడకు కాస్తా అటు ఇటుగా ఉన్నా.. ఈ రెండు నియోజకవర్గాల్లో పసుపు జెండానే రెపరెపలాడుతోందనే ఓ ప్రచారం సైతం సాగుతోంది. గత ఎన్నికల్లో జగన్ పార్టీ రైటు అనుకొని. వెళ్లిన వీరు.. నేడు ఆ పార్టీ రాంగ్ అని తెలుసుకొని సైకిల్ పార్టీలోకి వచ్చేశారనే ఓ చర్చ సైతం సాగుతోంది.

ఆంధ్రప్రదేశ్ వార్తలు కోసం..

Updated Date - Apr 11 , 2024 | 05:13 PM

Advertising
Advertising