Home » Vasantha Venkata Krishna Prasad
మంత్రి నారా లోకేశ్ నాయకత్వంలో ఏపీ విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. పేదరికం కారణంగా ఏ విద్యార్థీ చదువుకు దూరం కాకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
తడి, పొడి చెత్తను శాస్త్రీయ పద్ధతుల్లో కొండపల్లి మున్సిపాలిటీలోని అత్యాధునిక చెత్త వ్యర్థాల ప్రాసెసింగ్ ప్లాంట్ ప్రాసెస్ చేయనుందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు.
ప్రజాహితమే ప్రభుత్వ అభిమతమని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. కొండపల్లి మున్సిపల్ కార్యాలయంలో ‘ప్రజాదర్బారు’ నిర్వహించారు.
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద 'యోగాంధ్ర'లో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశా పాల్గొన్నారు. జూన్ 21న జరిగే యోగాంధ్ర విజయవంతానికి అందరూ సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (డా. NTTPS) నుంచి వెలువడుతున్న ఫ్లై యాష్ (బూడిద) కాలుష్య సమస్య ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి చేరింది. మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, జనసేన నాయకుడు అక్కల గాంధీ ఈ సమస్యను పవన్ కల్యాణ్‌కు వివరించారు.
పింఛన్ల పంపిణీలో అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా అమలు చేస్తున్నామని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వ్యాఖ్యానించారు. ఇచ్చిన మాట ప్రకారం ఇంటివద్దకే వచ్చి పింఛన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
భారీ ఈదురు గాలుల వల్ల నష్టపోయిన వారిని కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ హామీ ఇచ్చారు. మంగళవారం మైలవరం ఎమ్మెల్యే కార్యాలయంలో విలేకర్లతో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. ఈదురు గాలులకు చెట్లు విరిగిపడి గృహాలు దెబ్బతిన్నాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తెలుగు ప్రజల ఆశలసౌధమని మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ వ్యాఖ్యానించారు. అమెరికాలోని మేరీల్యాండ్‌లో శ్రీనాథ్‌రావుల అధ్యక్షతన ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమావేశం జరిగింది.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కొండపల్లి బొమ్మల కళను కాపాడేందుకు, ఈ హస్తకళాకారులకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీలు చేసిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని మధ్యాహ్న భోజనాన్ని రుచి చూశారు.