Share News

ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయం: వసంత కృష్ణప్రసాద్

ABN , Publish Date - Jun 24 , 2026 | 10:42 AM

ప్రజాహితమే ప్రభుత్వ అభిమతమని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. కొండపల్లి మున్సిపల్ కార్యాలయంలో ‘ప్రజాదర్బారు’ నిర్వహించారు.

ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయం: వసంత కృష్ణప్రసాద్
MLA Vasanta krishna prasad

ఎన్టీఆర్ జిల్లా, జూన్ 24: ప్రజాహితమే ప్రభుత్వ అభిమతమని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. ఈరోజు(బుధవారం) కొండపల్లి మున్సిపల్ కార్యాలయంలో ‘ప్రజాదర్బారు’ నిర్వహించారు. ప్రజాదర్బారులో పాల్గొన్న ఎమ్మెల్యే.. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. పింఛన్లు, ఇళ్ల స్థలాలు, రోడ్లు, డ్రైనేజీ, తాగునీటిపై వినతులు వచ్చాయి. వెంటనే అర్జీలను పరిష్కరించాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు.


ప్రజాదర్బారు ద్వారా ప్రజల వద్దకే పాలన చేరిందని ఎమ్మెల్యే అన్నారు. హౌసింగ్, రెవెన్యూ, మున్సిపల్ శాఖల సమస్యలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆదేశించారు. ప్రజాదర్బారులో జనసేన ఇన్‌ఛార్జి అక్కల గాంధీ, కూటమి నేతలు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...

రాధాగాయత్రి నాకు మంచి ఫ్రెండ్.. శ్రీచరణ్ తండ్రి కీలక వ్యాఖ్యలు

కృష్ణా జిల్లాలో మంత్రి లోకేశ్ పర్యటన.. నేతల ఘనస్వాగతం

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 24 , 2026 | 10:55 AM