Share News

కృష్ణా జిల్లాలో మంత్రి లోకేశ్ పర్యటన.. నేతల ఘనస్వాగతం

ABN , Publish Date - Jun 24 , 2026 | 10:26 AM

కృష్ణా జిల్లాలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పర్యటన కొనసాగుతోంది. అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం పెదప్రోలులో మంత్రికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

కృష్ణా జిల్లాలో మంత్రి లోకేశ్ పర్యటన.. నేతల ఘనస్వాగతం
Minister Nara Lokesh

కృష్ణాజిల్లా, జూన్ 24: జిల్లాలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పర్యటన కొనసాగుతోంది. అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం పెదప్రోలులో మంత్రికి మచిలీపట్నం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి, అవనిగడ్డ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. మోపిదేవి మండలంలో ఆధునీకరించిన కొక్కిలిగడ్డ జడ్పీ ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం పాఠశాలలో మొక్కలు నాటారు.


పాఠశాల ఆవరణలో గ్రామస్తులకు మంత్రి అభివాదం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, బోడె ప్రసాద్, వెనిగండ్ల రాము, ఎమ్మెల్సీ అశోక్ బాబు పాల్గొన్నారు. లోకేశ్ పర్యటన సందర్భంగా పెద్దఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. ప్రతిఒక్కరికీ అభివాదం చేస్తూ మంత్రి ముందుకు సాగారు.


అవనిగడ్డ నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా మోపిదేవిలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానాన్ని మంత్రి సందర్శించనున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆపై మోపిదేవిలో అవనిగడ్డ నియోజకవర్గం టీడీపీ కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. సాయంత్రం పులిగడ్డలో మత్స్యకారులతో మంత్రి లోకేశ్ సమావేశంకానున్నారు.


ఇవి కూడా చదవండి...

ఆన్‌లైన్‌లో సెప్టెంబర్ టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ

రాధాగాయత్రి నాకు మంచి ఫ్రెండ్.. శ్రీచరణ్ తండ్రి కీలక వ్యాఖ్యలు

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 24 , 2026 | 10:32 AM