Share News

ఆన్‌లైన్‌లో సెప్టెంబర్ టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ

ABN , Publish Date - Jun 24 , 2026 | 09:01 AM

స్వామి వారిని దర్శించుకునేందుకు తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ కీలక సూచన చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను బుధవారం (24-06-2026) ఉదయం 10.00 గంటలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

ఆన్‌లైన్‌లో సెప్టెంబర్ టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ

తిరుమల, జూన్ 24: తిరుమలలో స్వామి వారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టికెట్ల కోటాను బుధవారం (24-06-2026) ఉదయం 10.00 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది. టీటీడీ అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా లాగిన్ అయి తమకు కావాల్సిన స్లాట్లను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చని భక్తులకు సూచించింది. సాధారణంగా ఈ టికెట్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో అలర్ట్‌గా ఉండి ఈ టికెట్లు బుక్ చేసుకోవాలని భక్తులకు స్పష్టం చేసింది.


దర్శన టికెట్లతో పాటు తిరుమల, తిరుపతిలో భక్తులు బస చేయడానికి అవసరమైన వసతి గదుల కోటాను కూడా ఈ రోజు మధ్యాహ్నం 3.00 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు టీటీడీ తెలిపింది. సెప్టెంబర్‌లో స్వామి వారి దర్శనానికి వెళ్లే భక్తులు దర్శన టికెట్లతోపాటు వసతి గదులను కూడా ఇప్పుడే రిజర్వ్ చేసుకోవడం వల్ల తిరుమలలో ఎలాంటి ఇబ్బంది ఉందదు. దాంతో ప్రశాంతంగా శ్రీవారిని దర్శించుకుని రావచ్చు. అయితే నకిలీ వెబ్‌సైట్లు ఉన్నాయని వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కేవలం అధికారిక పోర్టల్ ద్వారానే టికెట్లు బుకింగ్ చేసుకోవాలని భక్తులకు టీటీడీ స్పష్టం చేసింది.


ఈ వార్తలనూ చదవండి:

గోల్డ్ రేట్స్.. భారీగా తగ్గిన ధరలు

కన్న కొడుకు దాడి.. పోలీసులను ఆశ్రయించిన తండ్రి

For More AP News And Telugu News

Updated Date - Jun 24 , 2026 | 09:17 AM