Share News

కన్న కొడుకు దాడి.. పోలీసులను ఆశ్రయించిన తండ్రి

ABN , Publish Date - Jun 24 , 2026 | 08:08 AM

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పరపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం కన్న తండ్రిపై కుమారుడు దాడి చేశారు. దీంతో ఆ తండ్రి పోలీసులను ఆశ్రయించాడు.

కన్న కొడుకు దాడి.. పోలీసులను ఆశ్రయించిన తండ్రి

హైదరాబాద్, జూన్24: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పరపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం కన్న తండ్రిపై కుమారుడు దాడి చేశారు. దీంతో ఆ తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఉప్పరపల్లి గ్రామంలో అనంత్ రెడ్డికి స్థానికంగా 31 గుంటల భూమి ఉంది. అందులో 300 గజాల భూమిని తన కోసం ఉంచుకుని.. మిగిలిన దానిని తన ఇద్దరి కుమారులకు సమానంగా పంచాడు అనంత్ రెడ్డి. అయితే ఆ 300 గజాల భూమి కూడా తనకే రాసివ్వాలంటూ తండ్రిపై చిన్న కుమారుడు ఓం రెడ్డి చాలా కాలంగా ఒత్తిడి చేస్తున్నాడు.


ఆ క్రమంలో మంగళవారం అర్థరాత్రి కన్న తండ్రిపై ఓం రెడ్డి పిడిగుద్దులతో విరుచుకు పడ్డాడు.. ఆ భూమిని తనకు రాసివ్వకుంటే చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. ఈ దాడిలో అనంత్ రెడ్డి గాయపడ్డాడు. తన కోసం ఉంచుకున్న స్థలాన్ని బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడంటూ చిన్న కుమారుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలోనూ ఇలాగే పలు మార్లు తనపై దాడులు చేశాడంటూ పోలీసులకు ఆ కన్న తండ్రి అనంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ దాడిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలనూ చదవండి:

గోల్డ్ రేట్స్.. భారీగా తగ్గిన ధరలు

ఇన్ఫోసిస్‌ను ఏఐ భర్తీ చేయదు..

For More TG News And Telugu News

Updated Date - Jun 24 , 2026 | 09:15 AM