Share News

ఇన్ఫోసిస్‌ను ఏఐ భర్తీ చేయదు..

ABN , Publish Date - Jun 24 , 2026 | 05:07 AM

ఇన్ఫోసిస్‌ లాంటి కంపెనీలను కృత్రిమ మేధ (ఏఐ) భర్తీ చేయదని.. నిర్దిష్ట లక్ష్యం, వేగంతో ముందుకెళ్తున్న తమను మరిం త విస్తరింపజేస్తుందని కంపెనీ చైర్మన్‌ నందన్‌ నీలేకని అన్నారు...

ఇన్ఫోసిస్‌ను ఏఐ భర్తీ చేయదు..

  • వ్యాపారాన్ని మరింత విస్తరిస్తుంది

  • కంపెనీ చైర్మన్‌ నందన్‌ నీలేకని

న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్‌ లాంటి కంపెనీలను కృత్రిమ మేధ (ఏఐ) భర్తీ చేయదని.. నిర్దిష్ట లక్ష్యం, వేగంతో ముందుకెళ్తున్న తమను మరిం త విస్తరింపజేస్తుందని కంపెనీ చైర్మన్‌ నందన్‌ నీలేకని అన్నారు. ప్రస్తుత సాంకేతిక పరివర్తనానికి ఇన్ఫోసిస్‌ గతంలో ఎన్నడూ లేనంత సంసిద్ధంగా ఉందన్నారు. 2030 నాటికి ఏఐలో 30,000-40,000 కోట్ల డాలర్ల మేర అవకాశాలను అందిపుచ్చుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఇన్ఫోసిస్‌ 45వ వార్షిక వాటాదారుల సమావేశం (ఏజీఎం)లో నీలేకని మాట్లాడుతూ.. ‘‘ప్రతి సాంకేతిక పరివర్తనం కంపెనీల మనుగడతో పాటు వ్యాపార వృద్ధి, మార్జిన్లను రక్షించుకోగలిగే సామర్థ్యంపై ప్రశ్న లు లేవనెత్తుతుంది. ఏఐ భారీ, విప్లవాత్మక పరివర్తనం కాబట్టి ప్రశ్నలు బిగ్గరగా ధ్వనిస్తాయి. సందేహాలు ఎంతకీ తీరవు’’ అని అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

  • ఎంటర్‌ప్రైజ్‌ సొల్యూషన్స్‌కు కఠినమైన పరీక్ష, స్థితిస్థాపక నిర్మాణ వ్యవస్థ, పటిష్ఠమైన సైబర్‌ భద్రత, డేటా పాలన ప్రమాణాలు కావాలి. ఆ బాధ్యతలను బయటి ప్లాట్‌ఫామ్స్‌కు అప్పగించలేము.

  • ఏఐ విప్లవం వారసత్వ ఆధునీకరణను అత్యవసరంగా మార్చింది. ఈ సాంకేతిక నిర్మాణాత్మక మార్పును సద్వినియోగం చేసుకునే స్థితిలో ఇన్ఫోసి్‌సను నిలబెట్టింది.

  • ఇంటెలిజెంట్‌ ఏఐ సిస్టమ్స్‌ను మిషన్‌ క్రిటికల్‌ ఎంటర్‌ప్రైజ్‌ ప్లాట్‌ఫామ్స్‌తో అనుసంఽధానించడంలో భారీ అవకాశాలు లభించనున్నాయి. ఏఐ మోడళ్లు, ఏజెంట్లను సంప్రదా య లావాదేవీల వ్యవస్థతో కలిపే ప్రక్రియల ద్వారా ఐటీ కంపెనీలకు భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది.

  • ఎంటర్‌ప్రైజ్‌ ఏఐలోని సంక్లిష్టతలను అధిగమించడంలో సహాయపడే విషయంలో మా క్లయింట్లు ఇన్ఫోసి్‌సను విశ్వసించారు. వారి నమ్మకాన్ని నిలబెట్టేలా, భవిష్యత్‌ సంక్లిష్టతలను అధిగమించేందుకు అవసరమైన సేవలందించేందుకు ఇన్ఫోసిస్‌ పూర్తి సిద్ధంగా ఉంది.


ఏఐలో వేగంగా విస్తరణ: పరేఖ్‌

ఏఐ విభాగంలో తమ అడుగుజాడలను దూకుడుగా విస్తరిస్తునట్లు ఇన్ఫోసిస్‌ సీఈఓ, ఎండీ సలీల్‌ పరేఖ్‌ తెలిపారు. కంపెనీ ఏఐ సేవల ఆదాయ వాటా వేగంగా పెరుగుతోందన్నారు. క్లయింట్లు ప్రధానంగా ఆరు విభాగాల్లో (ఏఐ ఇంజనీరింగ్‌ అండ్‌ స్ట్రాటజీ, డేటా, ప్రాసెస్‌ ఎఫిషియెన్సీ, టెక్నాలజీ ఆధునీకరణ, భౌతిక ఏఐ, ఏఐ ట్రస్ట్‌ అండ్‌ సెక్యూరిటీ) ఏఐని వినియోగించుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని పరేఖ్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

వర్షంలో కారు నడుపుతున్నారా? ఈ ట్రిక్ ఫాలో అవ్వండి

తమిళనాడు సీఎం విజయ్‌పై ఉదయనిధి వ్యక్తిగత విమర్శలు!

Updated Date - Jun 24 , 2026 | 05:07 AM