Share News

పారదర్శకంగా పింఛన్లు పంపిణీ చేస్తున్నాం: ఎమ్మెల్యే వసంత

ABN , Publish Date - Jun 01 , 2026 | 08:58 AM

పింఛన్ల పంపిణీలో అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా అమలు చేస్తున్నామని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వ్యాఖ్యానించారు. ఇచ్చిన మాట ప్రకారం ఇంటివద్దకే వచ్చి పింఛన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

పారదర్శకంగా పింఛన్లు పంపిణీ చేస్తున్నాం: ఎమ్మెల్యే వసంత
MLA Vasantha Krishna Prasad

ఎన్టీఆర్ జిల్లా, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): పింఛన్ల పంపిణీలో అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా అమలు చేస్తున్నామని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ (MLA Vasantha Krishna Prasad) వ్యాఖ్యానించారు. ఇచ్చిన మాట ప్రకారం ఇంటివద్దకే వచ్చి పింఛన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈరోజు (సోమవారం) జి.కొండూరు మండలం ఆత్కూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఎమ్మెల్యే వసంత పంపిణీ చేశారు.


లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత మాట్లాడారు. 23 నెలల్లో మైలవరం నియోజకవర్గంలో రూ.417.36 కోట్ల పింఛన్ల సొమ్ము పంపిణీ చేశామని వెల్లడించారు. జూన్ మాసానికి 42,979 మందికి రూ.18.85 కోట్ల పింఛన్లు అందజేస్తున్నామని చెప్పుకొచ్చారు. మైలవరం మండలంలో 9,370 మందికి రూ.4.06 కోట్లు, జి.కొండూరులో 8,382 మందికి రూ.3.61 కోట్లు పంపిణీ చేశామని వివరించారు. ఇబ్రహీంపట్నంలో 4,663 మందికి రూ.2.01 కోట్లు, రెడ్డిగూడెంలో 7,045 మందికి రూ.3.04 కోట్లు పంపిణీ చేశామని అన్నారు.


విజయవాడ రూరల్‌లో 8,351 మందికి రూ.3.60 కోట్లు, కొండపల్లిలో 5,168 మందికి రూ.2.29 కోట్లు పంపిణీ చేశామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతినెలా నియోజకవర్గంలో 42 వేల మందికి పైగా రూ.18 కోట్లకు పైగా పింఛన్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా రూ.4 వేల నుంచి రూ.15 వేలకు పింఛన్లను పెంచుతున్నట్లు తెలిపారు. త్వరలోనే అర్హులందరికీ నూతన పింఛన్లు మంజూరు చేస్తామని అన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. అమరావతి అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాల అమల్లోనూ రాజీ లేదని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

విజయవాడలో ‘పెద్ది’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్..!

యువ క్రీడాకారులకు స్ఫూర్తి సాత్విక్-చిరాగ్: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 01 , 2026 | 09:08 AM