Share News

యోగా మన జీవితంలో భాగం కావాలి: వసంత కృష్ణప్రసాద్

ABN , Publish Date - Jun 10 , 2026 | 11:00 AM

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద 'యోగాంధ్ర'లో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశా పాల్గొన్నారు. జూన్ 21న జరిగే యోగాంధ్ర విజయవంతానికి అందరూ సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.

యోగా మన జీవితంలో భాగం కావాలి: వసంత కృష్ణప్రసాద్
Vasantha Krishna Prasad

ఎన్టీఆర్ జిల్లా, జూన్ 10: ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద 'యోగాంధ్ర'లో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశా పాల్గొన్నారు. జూన్ 7 నుంచి 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా యోగాంధ్ర అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జూన్ 21న జరిగే యోగాంధ్ర విజయవంతానికి అందరూ సహకరించాలని కోరారు. యోగా మన జీవితంలో భాగం కావాలన్నారు. ఒత్తిడి, షుగర్, గుండెపోటు నియంత్రణకు యోగా అవసరమని తెలిపారు. భారతీయ సంస్కృతికి యోగా ప్రతీక అని, శాస్త్రీయంగా నిరూపితమైందన్నారు. ‘ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా’ థీమ్‌తో ప్రభుత్వ కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు.


జూన్ 21న అమరావతిలో భారీ యోగా వేడుకలకు సీఎం చంద్రబాబు నాయకత్వం వహించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రధాని మోదీ యోగాను ప్రపంచానికి పరిచయం చేశారని.. ప్రతి ఇంట్లో రోజూ అరగంట యోగా చేయాలని సూచించారు. యోగాతో శారీరక, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెరుగుతుందన్నారు. యువత చెడు అలవాట్లు వీడి యోగాను అలవర్చుకోవాలని తెలిపారు. పాఠశాల స్థాయి నుంచే యోగాపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని వసంత కృష్ణప్రసాద్ సూచించారు.


ఇవి కూడా చదవండి...

ఎన్డీయే ఇక.. శక్తిమంతం!

బాలకృష్ణకు సీఎం చంద్రబాబు, లోకేశ్ పుట్టినరోజు శుభాకాంక్షలు

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 10 , 2026 | 11:11 AM