బాలకృష్ణకు సీఎం చంద్రబాబు, లోకేశ్ పుట్టినరోజు శుభాకాంక్షలు
ABN , Publish Date - Jun 10 , 2026 | 09:49 AM
ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు నేడు. బాలకృష్ణకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
అమరావతి, జూన్ 10: ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా బాలయ్యకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బాలకృష్ణకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఐదు దశాబ్దాలుగా సినీ వినీలాకాశంలో ధ్రువతారగా బాలయ్య వెలుగొందుతున్నారని సీఎం అన్నారు. భోళాతనానికి ప్రతిరూపమైన బాలా మామయ్యకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ లోకేశ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
చంద్రబాబు ట్వీట్..
‘సినీ, రాజకీయ, సేవా రంగాలలో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ అజేయంగా ముందుకు వెళుతున్న పద్మభూషణుడు, హిందూపురం శాసనసభ్యుడు, నా ఆప్తుడు నటసింహం నందమూరి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు. ఐదు దశాబ్దాలుగా సినీ వినీలాకాశంలో ధ్రువతారగా వెలుగొందుతూ, మాతృమూర్తి పేరుతో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గా అశేష జనానికి ఆపన్నహస్తం అందిస్తూ, హిందూపురం ప్రజలకు అండగా నిలుస్తూ మీరు సాగిస్తున్న జీవనయానం నిరంతరంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. నవరస నటనా సార్వభౌముడు, తెలుగువారి అన్న నందమూరి తారక రామారావు దివ్య ఆశీస్సులు మీపై కలకాలం ఉండాలని కోరుకుంటూ మరొక్క మారు జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ సీఎం పోస్ట్ చేశారు.
అభిమానులకు గాడ్ ఆఫ్ మాసెస్: లోకేశ్
‘నిండైన తెలుగుదనం.. అభిమానం.. భోళాతనానికి ప్రతిరూపం మా బాలా మావయ్యకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. అభిమానుల పాలిట గాడ్ ఆఫ్ మాసెస్, క్యాన్సర్ బాధితులకు సాంత్వన చేకూర్చే ఆపన్న హస్తం, హిందూపురం ప్రజా విజేత బాలా మావయ్య ఆయురారోగ్యాలతో వందేళ్లు వర్ధిల్లాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అంటూ మంత్రి లోకేశ్ తెలిపారు.
ఇవి కూడా చదవండి...
యూఎస్ ఆర్మీ హెలికాఫ్టర్‌ను కూల్చేసిన ఇరాన్.. అమెరికా ప్రతీకార దాడులు..
Read Latest AP News And Telugu News