Share News

ఆహ్లాదభరితంగా యోగా!

ABN , Publish Date - Jun 10 , 2026 | 06:07 AM

మార్కాపురం జిల్లాలోని కంభం చెరువు కట్టపై ఓ వైపు సముద్రాన్ని తలపించేలా చెరువు. మరోవైపు పచ్చటి పంటలు ఉంటాయి.

ఆహ్లాదభరితంగా యోగా!

కంభం, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): మార్కాపురం జిల్లాలోని కంభం చెరువు కట్టపై ఓ వైపు సముద్రాన్ని తలపించేలా చెరువు. మరోవైపు పచ్చటి పంటలు ఉంటాయి. విశాలమైన ఈ చెరువుకట్టపై మొదటిసారి వందల మంది స్థానికులతో కలెక్టర్‌, ఎమ్మెల్యే, జిల్లా స్థాయి అధికారులు యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. చల్లటి గాలులు, ప్రకృతి రమణీయత నడుమ యోగాసనాలు వేశారు. తమకు ఎనలేని అనుభూతిని కలిగించిందని వారు తెలిపారు.

Updated Date - Jun 10 , 2026 | 06:08 AM