Share News

కాంగ్రెస్‌ డివిజన్‌ కమిటీల ఏర్పాటు ఎప్పుడో?

ABN , Publish Date - Jun 10 , 2026 | 10:08 AM

అంబర్‌పేట నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ డివిజన్‌ కమిటీల ఏర్పాటులో పార్టీ నియోజకవర్గ నాయకత్వం నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తోందనే విమర్శలు వస్తున్నాయి.

కాంగ్రెస్‌ డివిజన్‌ కమిటీల ఏర్పాటు ఎప్పుడో?
Hyderabad Congress Party

  • కమిటీల ఏర్పాటుపై పార్టీ నియోజకవర్గ నాయకత్వం నిర్లక్ష్యం

  • కమిటీలో స్థానం కోసం అంబర్‌పేటలోని 8 డివిజన్ల నుంచి నాయకుల ఎదురుచూపులు

హైదరాబాద్: అంబర్‌పేట నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ డివిజన్‌ కమిటీల ఏర్పాటులో పార్టీ నియోజకవర్గ నాయకత్వం నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. నగరంలోని అన్ని నియోజకవర్గాలలో డివిజన్‌ కమిటీల ఏర్పాటు పూర్తయినప్పటికీ అంబర్‌పేటలో మాత్రం ఇంత వరకు డివిజన్‌ అధ్యక్షుల నియామకం చేపట్టలేదు. దీంతో నియోజకవర్గంలోని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర నిరాశ చెందుతున్నారు. జీహెచ్‌ఎంసీ డివిజన్ల పునర్విభజనలో ఈ నియోజకవర్గంలో కొత్తగా మూడు డివిజన్లను అధికారులు ఏర్పాటు చేశారు.


దీంతో ఇక్కడి డివిజన్ల సంఖ్య 8కి పెరిగింది. నియోజకవర్గంలోని బర్కత్‌పుర, కాచిగూడ, గోల్నాక, నల్లకుంట, తిలక్‌నగర్‌, బాగ్‌అంబర్‌పేట, అంబర్‌పేట, పటేల్‌నగర్‌ డివిజన్లకు అధ్యక్షులను నియమించాల్సి ఉంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నవంబర్‌ లేక డిసెంబర్‌లో జరుగుతాయని ప్రచారం జరుగుతుండడంతో డివిజన్ల అధ్యక్ష పదవికి పోటీ బాగా నెలకొంది. మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు ఇదే నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేత కావడంతో డివిజన్‌ అధ్యక్షుల నియామకంపై అందరి దృష్టి ఉంది.


ఈ నియోజకవర్గం ఇన్‌చార్జి డాక్టర్‌ సి.రోహిణ్‌రెడ్డి, ఖైరతాబాద్‌ జిల్లా అధ్యక్షుడు మోత రోహిత్‌లు డివిజన్‌ అధ్యక్షుల నియామకంపై ప్రత్యేక దృష్టి సారించడం లేదని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డివిజన్‌ అధ్యక్షుల నియామకంలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలని, రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై దీని ప్రభావం ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


city4.2.jpgబర్కత్‌పుర డివిజన్‌ అధ్యక్షుడిగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నియమించాలని, నల్లకుంట బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని, బాగ్‌అంబర్‌పేట, తిలక్‌నగర్‌, పటేల్‌నగర్‌ డివిజన్ల అధ్యక్షులుగా బీసీలను, కాచిగూడ ఏస్సీ, గోల్నాక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారిని, అంబర్‌పేట ముస్లింలకు మైనారిటీలకు కేటాయిస్తే పార్టీకి ప్రయోజనం ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. అంబర్‌పేట నియోజకవర్గానికి చెంది ఏ బ్లాక్‌, బి బ్లాక్‌ కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి:

నేడు పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 10 , 2026 | 10:08 AM