దర్శక దిగ్గజం భారతీరాజా కన్నుమూత..
ABN , Publish Date - Jun 10 , 2026 | 07:54 AM
భారత చలనచిత్ర దర్శక దిగ్గజం భారతీరాజా కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన 84 ఏళ్ల వయసులో బుధవారం కన్నుమూశారు.
చెన్నై, జూన్ 10: భారత చలనచిత్ర దర్శక దిగ్గజం భారతీరాజా కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలోనే చికిత్స తీసుకుంటున్నారు. 84 ఏళ్ల వయసులో బుధవారం తుదిశ్వాస విడిచారు. ఈ రోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. భారతీరాజా మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
కొత్త జీవితాలు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ..
1977లో విడుదలైన '16 వయత్తినిలే' సినిమాతో దర్శకుడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. దర్శకుడు, నటుడు, నిర్మాతగా భారతీరాజా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కొత్త జీవితాలు సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. సీతాకోక చిలుక, ఆరాధన, జమదగ్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. సీతాకోక చిలుక సినిమాకు గానూ భారతీరాజా నంది అవార్డు సొంతం చేసుకున్నారు. 2004లో ఆయనకు పద్మశ్రీ పురస్కారం వచ్చింది.
ఇవి కూడా చదవండి
వేప ఆకులే కాదు.. పండు కూడా ఔషధమే!
మేం రాలేం.. కావాలంటే క్యాబ్ బుక్ చేస్తాం!