తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు
ABN , Publish Date - Jun 10 , 2026 | 06:31 AM
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని తొమ్మిది షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం సర్కిల్ మీదుగా బాటగంగమ్మ ఆలయ సర్కిల్ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు.
ఆదివారం హుండీ ఆదాయం: రూ.4.44 కోట్లు
సోమవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 95,152
తలనీలాలు సమర్పించినవారు: 40,601
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News