Share News

బానిసై పోయాడు...రక్షించండి

ABN , Publish Date - Jun 10 , 2026 | 05:43 AM

సెల్‌ఫోన్‌కు బానిసైన కుమారుడిపై తల్లిదండ్రులు శక్తి టీమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు అతడిని అదుపులోకి తీసుకుని డీ అడిక్షన్‌ సెంటర్‌కు తరలించారు.

బానిసై పోయాడు...రక్షించండి

  • పోలీసులను ఆశ్రయించిన తల్లిదండ్రులు

ఏలూరు క్రైం, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): సెల్‌ఫోన్‌కు బానిసైన కుమారుడిపై తల్లిదండ్రులు శక్తి టీమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు అతడిని అదుపులోకి తీసుకుని డీ అడిక్షన్‌ సెంటర్‌కు తరలించారు. ఏలూరుకు చెందిన 15 ఏళ్ల బాలుడు సెల్‌ఫోన్‌లో ఆన్‌లైన్‌ గేమ్స్‌, సోషల్‌ మీడియా చూస్తూ తీవ్రంగా బానిసయ్యాడు. రాత్రంతా గేమ్‌లు ఆడుతూ పగలు నిద్రపోవడం, పాఠశాలకు వెళ్లకపోవడం, తల్లిదండ్రులపై తిరగబడి చేయి చేసుకోవడం వంటి చేష్టలతో నిత్యం నరకం చూపుతున్నాడు. దీంతో తమ బిడ్డ ఏమైపోతాడోనని భయపడి తల్లిదండ్రులు ఏలూరు మహిళా పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు. సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో బాలుడికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అతడిని వ్యసనాలబారి నుంచి బయటపడేయడానికి ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో ఉన్న డీ అడిక్షన్‌ సెంటర్‌లో చేర్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. పిల్లల ప్రవర్తనలో అసాధారణమైన మార్పులు ఉన్నట్లు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

Updated Date - Jun 10 , 2026 | 05:45 AM