Share News

మల్కాజ్‌‌గిరిలో దారుణం.. భార్యను కాల్చిచంపిన భర్త..

ABN , Publish Date - Jun 10 , 2026 | 09:44 AM

హైదరాబాద్ నగరంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. అనుమానం నేపథ్యంలో ఓ భర్త తన భార్యను తుపాకితో కాల్చి చంపాడు. మాట్లాడుకుందాం అని పిలిచి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.

మల్కాజ్‌‌గిరిలో దారుణం.. భార్యను కాల్చిచంపిన భర్త..
Malkajgiri shooting

హైదరాబాద్, జూన్ 10: నగరంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. అనుమానం నేపథ్యంలో ఓ భర్త తన భార్యను తుపాకితో కాల్చి చంపాడు. మాట్లాడుకుందాం అని పిలిచి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మల్కాజ్‌గిరికి చెందిన అరుణ్ అనే వ్యక్తికి పదేళ్ల క్రితం ఓ మహిళ‌తో పెళ్లైంది. వివాహం అనంతరం భార్యతో విభేదాలు తలెత్తాయి. అరుణ్ వేధింపులు తట్టుకోలేక ఆమె దూరంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో భార్య చెల్లెలు ఉషారాణితో అరుణ్ సహజీవనం మొదలుపెట్టాడు. ఐదు సంవత్సరాల క్రితం యాదగిరిగుట్టలో ఉషారాణిని వివాహం చేసుకున్నాడు.


అరుణ్, ఉషారాణి మల్కాజ్‌గిరిలోని మారుతి నగర్‌లో ఇళ్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. ఉషారాణి మరొకరితో సన్నిహితంగా ఉంటోందని, చాటింగ్ చేస్తోందని అరుణ్ అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య గత కొన్ని నెలల నుంచి గొడవలు జరుగుతున్నాయి. గొడవల కారణంగా ఉషారాణి భర్తకు దూరంగా ఉంటోంది. దీంతో భార్య మీద పగ పెంచుకున్న అరుణ్ ఆమెను చంపాలని నిశ్చయించుకున్నాడు. ఉషారాణిని మాట్లాడుకుందాం అని పిలిచి తుపాకితో కాల్చాడు.


బుల్లెట్ల కారణంగా తీవ్రంగా గాయపడ్డ ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఉషారాణిని చంపడానికి అరుణ్ తుపాకి కొనుగోలు చేసినట్లుగా అనుమానిస్తున్నారు. తుపాకి ఎవరిచ్చారు? ఎక్కడి నుంచి వచ్చింది? అన్న అంశాలపై ఆరా తీస్తున్నారు.


ఇవి కూడా చదవండి

బడి పిల్లలపై బ్యాగు భారం

బ్రేక్‌ఫాస్ట్‌కు బెస్ట్ ఆప్షన్ కట్టె పొంగలి.. తయారీ విధానం ఇలా

Updated Date - Jun 10 , 2026 | 10:12 AM