ఏ విద్యార్థీ చదువుకు దూరం కాకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
ABN , Publish Date - Jul 24 , 2026 | 10:59 AM
మంత్రి నారా లోకేశ్ నాయకత్వంలో ఏపీ విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. పేదరికం కారణంగా ఏ విద్యార్థీ చదువుకు దూరం కాకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఎన్టీఆర్ జిల్లా, జులై 24: మంత్రి నారా లోకేశ్ నాయకత్వంలో ఏపీ విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. ఈరోజు(శుక్రవారం) మీడియాతో మాట్లాడుతూ.. కొండపల్లి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ - టీచర్స్ సమావేశం 4.0. ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. పేదరికం కారణంగా ఏ విద్యార్థీ చదువుకు దూరం కాకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ తల్లికి వందనం పథకం వర్తిస్తుందని చెప్పారు.
2047 వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో విద్యా నాణ్యత పెంపే ప్రభుత్వ లక్ష్యమని చెప్పుకొచ్చారు. ప్రతి తల్లిదండ్రులు LEAP యాప్ తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం విద్యారంగంలో సమగ్ర సంస్కరణలు అమలు చేస్తోందని ఎమ్మెల్యే వసంత వెంకట ప్రసాద్ వెల్లడించారు. ఈ సందర్భంగా కొండపల్లి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే.. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నాణ్యతను పరిశీలించారు.
ఇవి కూడా చదవండి...
తమ్మినేని ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ
పార్వతీపురం మన్యం జిల్లాకు కుంకీ ఏనుగుల తరలింపు.. మంగళగిరిలో పవన్ స్వాగతం
Read Latest AP News And Telugu News