ఏపీలో NH-42 అభివృద్ధికి రూ.679.71 కోట్లు మంజూరు.. కేంద్రానికి పవన్ కృతజ్ఞతలు
ABN , Publish Date - Jul 24 , 2026 | 10:10 AM
ఏపీలోని NH-42 అభివృద్ధి పనుల కోసం రూ.679.71 కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా ప్రకటించారు.
అమరావతి, జులై 24 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారి మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని NH-42 అభివృద్ధి పనుల కోసం రూ.679.71 కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు.
NH-42 అప్‌గ్రేడేషన్‌కు భారీగా నిధులు కేటాయించడంతో ఏపీలో రహదారి కనెక్టివిటీ మరింత మెరుగుపడుతుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ప్రయాణ సమయం తగ్గడంతో పాటు రవాణా వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.
ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి కూడా ఈ ప్రాజెక్ట్ కీలకంగా మారనుందని పేర్కొన్నారు. మెరుగైన రహదారి సౌకర్యాల వల్ల పరిశ్రమలు, వ్యాపార కార్యకలాపాలు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. లక్షలాది మంది ప్రజలకు సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణ సౌకర్యం అందించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచ స్థాయి మౌలిక వసతులు అందించాలనే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం పనిచేస్తోందని పవన్ కల్యాణ్ వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నిరంతరం సహకరిస్తోందని వివరించారు. ఈ నిధుల కేటాయింపు అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ అమలుతో రాష్ట్ర రహదారి నెట్‌వర్క్ మరింత బలోపేతం కానుందని పవన్ కల్యాణ్ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
దేవతా విగ్రహాలపై దుశ్చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు: మంత్రి ఆనం
అమరావతికి ప్రముఖ విద్యాసంస్థలు వస్తున్నాయి: మంత్రి గొట్టిపాటి
భూమన ఆక్రమించిన భూముల స్వాధీనానికి ఏపీ ప్రభుత్వం చర్యలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News