తమ్మినేని ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ

ABN, Publish Date - Jul 24 , 2026 | 08:46 AM

వైసీపీ నేత, మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. నకిలీ పత్రాలతో ప్రైవేటు భూమిని ఆక్రమించిన కేసులో తమ్మినేని సీతారాం, కుటుంబ సభ్యులదే ప్రధాన పాత్రని పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండే లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు.

అమరావతి: వైసీపీ నేత, మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. నకిలీ పత్రాలతో ప్రైవేటు భూమిని ఆక్రమించిన కేసులో తమ్మినేని సీతారాం, కుటుంబ సభ్యులదే ప్రధాన పాత్రని పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండే లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. మాజీ స్పీకర్ నేతృత్వంలోనే ఆస్తి రిజిస్ట్రేషన్ ప్రణాళిక జరిగిందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా నిందితులను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాలని కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు.. ఈనెల 27న తీర్పు వెల్లడిస్తామని తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి

ఆసియాన్ రీజినల్ ఫోరం వేదికగా పాక్ అసత్య ప్రచారం.. తిప్పికొట్టిన భారత్..

ఉధృతంగా మారిన సీజేపీ ఆందోళన.. ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం

Updated at - Jul 24 , 2026 | 08:53 AM