Share News

హరిత కొండపల్లి నిర్మాణమే లక్ష్యం: ఎమ్మెల్యే వసంత

ABN , Publish Date - Jul 18 , 2026 | 01:55 PM

తడి, పొడి చెత్తను శాస్త్రీయ పద్ధతుల్లో కొండపల్లి మున్సిపాలిటీలోని అత్యాధునిక చెత్త వ్యర్థాల ప్రాసెసింగ్ ప్లాంట్‌ ప్రాసెస్ చేయనుందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు.

హరిత కొండపల్లి నిర్మాణమే లక్ష్యం: ఎమ్మెల్యే వసంత
AP CM Chandrababu Naidu

ఎన్టీఆర్ జిల్లా, జులై 18 (ఆంధ్రజ్యోతి): తడి, పొడి చెత్తను శాస్త్రీయ పద్ధతుల్లో కొండపల్లి మున్సిపాలిటీలోని అత్యాధునిక చెత్త వ్యర్థాల ప్రాసెసింగ్ ప్లాంట్‌ ప్రాసెస్ చేయనుందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. ఈరోజు (శనివారం) ఈ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పాల్గొని ప్రసంగించారు.


పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణకు కీలక అడుగు పడిందని ఎమ్మెల్యే వసంత వెల్లడించారు. చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసిందని తెలిపారు. పట్టణంలో దుర్వాసనలు, వ్యాధులు, భూ-వాయు కాలుష్యాన్ని ఈ ప్లాంట్ తగ్గించనుందని చెప్పుకొచ్చారు. కాలుష్య రహిత, పరిశుభ్రమైన, హరిత కొండపల్లి నిర్మాణమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందని తెలిపారు. చెత్తను విలువైన వనరుగా ఆధునిక వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ మార్చనుందని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

విమాన ప్రయాణికులపై భారం పడనివ్వబోం: రామ్మోహన్

పలాస ఘటనలో తప్పు ఎవరూ చేసినా ఉపేక్షించబోం: హోం మంత్రి అనిత

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 18 , 2026 | 02:12 PM