Share News

పలాస ఘటనలో తప్పు ఎవరూ చేసినా ఉపేక్షించబోం: హోం మంత్రి అనిత

ABN , Publish Date - Jul 16 , 2026 | 03:52 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పలాస ఘటనలో తప్పు ఎవరూ చేసినా ఉపేక్షించబోం: హోం మంత్రి అనిత
Home Minister Vangalapudi Anita

విజయనగరం, జులై 16 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anita) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలాస ఘటనలో తప్పు ఎవరూ చేసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ ఘటనను కూడా తాము సీరియస్‌గా తీసుకున్నామని స్పష్టం చేశారు. గొడ్డలి పార్టీ నీచపు రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఈరోజు (గురువారం) విజయనగరంలో హోం మంత్రి అనిత పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. బాధితులను పరామర్శించడానికి వచ్చిన ప్రతిసారి జగన్ రెడ్డి బలప్రదర్శన చేస్తున్నారని దుయ్యబట్టారు.


జగన్ హయాంలో ఒక్క మత్స్యకారుడిని పట్టించుకోలేదు..

విశాఖపట్నం మత్స్యకారుల విషయాన్ని జగన్ అండ్ కో రాజకీయం చేయడానికి ప్రయత్నించి విఫలమైందని అనిత విమర్శించారు. వైసీపీ హయాంలో ఒక్క మత్స్యకారుడిని కూడా పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహించారు. బోటు గల్లంతైన వెంటనే ప్రభుత్వం స్పందించి నేవీ అధికారులకు సమాచారం అందజేసిందని తెలిపారు. వెంటనే 72 గంటల పాటు గాలింపు చర్యలు చేపట్టామని వివరించారు.


పోలీసుల సంక్షేమాన్ని పట్టించుకోలేదు..

జగన్ హయాంలో పోలీసులను వాడుకున్నారే తప్పా వారి సంక్షేమాన్ని ఎందుకు పట్టించుకోలేదని అనిత ప్రశ్నించారు. ఎన్‌డీఏ ప్రభుత్వం పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు పెండింగ్‌లోని పరిహారం చెల్లిస్తామని మాటిచ్చారు. జిందాల్ పరిశ్రమకు సంబంధించి రైతులకు కూడా పరిహార చెక్కులను వెంటనే చెల్లిస్తామని హోం మంత్రి అనిత పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

జగన్ రెడ్డిది రాక్షస మనస్తత్వం.. మంత్రి నిమ్మల ధ్వజం

తుది దశకు అహ్మదాబాద్ విమాన ప్రమాద దర్యాప్తు: కేంద్రమంత్రి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 16 , 2026 | 04:20 PM