భారీ ఈదురు గాలులు.. నష్టాన్ని అంచనా వేస్తున్నాం: ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
ABN , Publish Date - May 26 , 2026 | 08:51 PM
భారీ ఈదురు గాలుల వల్ల నష్టపోయిన వారిని కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ హామీ ఇచ్చారు. మంగళవారం మైలవరం ఎమ్మెల్యే కార్యాలయంలో విలేకర్లతో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. ఈదురు గాలులకు చెట్లు విరిగిపడి గృహాలు దెబ్బతిన్నాయని తెలిపారు.
మైలవరం, మే26: భారీ ఈదురు గాలుల వల్ల నష్టపోయిన వారిని కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ హామీ ఇచ్చారు. మంగళవారం మైలవరం ఎమ్మెల్యే కార్యాలయంలో విలేకర్లతో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. ఈదురు గాలులకు చెట్లు విరిగిపడి గృహాలు దెబ్బతిన్నాయని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని పేర్కొన్నారు. దెబ్బతిన్న గృహలను అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారని చెప్పారు. విద్యుత్ స్తంభాలు పడిపోయి తీగలు తెగిపోవడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని తెలిపారు.
మంగళవారం సాయంత్రానికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తారన్నారు. ధాన్యం కొనుగోళ్లు జరగలేదని కొందరు పని పాట లేని వారు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. 95 శాతం ధాన్యం కొనుగోలు చేసి.. ఆ నగదు రైతుల ఖాతాల్లో వేయడం జరిగిపోయిందని వివరించారు. గత ప్రభుత్వంలో మూడు నెలలకు కూడా ధాన్యం నగదు పడేవి కావని వైసీపీ తీరును ఈ సందర్భంగా ఆయన ఎండగట్టారు.
అసలు వాస్తవాలు రైతులకు తెలుసునని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వెల్లడించారు. ఇటీవల మైలవరంలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఈ గాలులకు కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి. భారీ చెట్లు కూడా నెలకొరిగాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పైవిధంగా స్పందించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా: దామోదర రాజనర్సింహ
సింగరేణిపై కాంగ్రెస్ అక్రమాలు మరిన్ని బయటపెడతా: హరీష్ రావు
Read Latest TG News And Telugu News