ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Janasena: 30 నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం

ABN, Publish Date - Mar 25 , 2024 | 10:10 PM

జనసేన ఎన్నికల ప్రచారంలో సమరశంఖం పూరించడానికి సిద్ధమయింది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను చేపట్టాలని జనసేన కీలక నేతలకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సూచించారు. సోమవారం నాడు మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులతో పవన్ సమావేశం అయ్యారు.

అమరావతి: జనసేన ఎన్నికల ప్రచారంలో సమరశంఖం పూరించడానికి సిద్ధమయింది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను చేపట్టాలని జనసేన కీలక నేతలకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సూచించారు. సోమవారం నాడు మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులతో పవన్ సమావేశం అయ్యారు. ఈ సమావేశం దాదాపు రెండు గంటల పాటు జరిగింది. 30వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ ప్రచారం ప్రారంభం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగినట్లు సమాచారం. పిఠాపురం నుంచి పవన్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. పిఠాపురం కేంద్రంగా రాష్ట్రవ్యాప్త పర్యటనలకు ప్రణాళికలు రూపొందించారు. మూడు విడతలుగా ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ప్రతి విడతలో జనసేన పోటీ చేసే నియోజకవర్గాలకు వెళ్లేలా షెడ్యూల్ ఖరారైంది. తొలి రోజు శక్తిపీఠమైన శ్రీ పురూహూతిక అమ్మవారిని పవన్ కళ్యాణ్ దర్శనం చేసుకోనున్నారు. అక్కడ వారాహి వాహనానికి పూజలు, అనంతరం దత్తపీఠాన్ని దర్శించుకోనున్నారు. మూడు రోజులపాటు పిఠాపురం నియోజకవర్గంలోనే పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పార్టీ నాయకులతో సమావేశాలు.. ప్రజలను పవన్ కళ్యాణ్ కలవనున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 25 , 2024 | 10:10 PM

Advertising
Advertising