AP Politics: వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ కీలక నేతలు..
ABN, Publish Date - Oct 09 , 2024 | 08:11 PM
TDP vs YSRCP: వైసీపీకి మరో బిగ్ షాక్. ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన కీలక నేతలు ఇద్దరు తెలుగు దేశం పార్టీలో చేరారు. బుధవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో వారిద్దరూ టీడీపీలో చేరారు.
TDP vs YSRCP
అమరావతి, అక్టోబర్ 09: వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన కీలక నేతలు ఇద్దరు తెలుగు దేశం పార్టీలో చేరారు. బుధవారం నాడు మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావులు తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు వీరిద్దరికీ కండువా కప్పి పార్టీలో సాదరంగా ఆహ్వానించారు. వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యులుగా ఉన్న వీరిద్దరూ తమ పదవులకు, పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
Updated Date - Oct 09 , 2024 | 08:11 PM