బొకేలు తేవొద్దు: మంత్రి అచ్చెన్న
ABN, Publish Date - Dec 30 , 2024 | 04:26 AM
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తనను కలిసేందుకు వచ్చే వారు బొకేలు, గజమాలలు, దుశ్శాలువాలు తీసుకురావద్దని మంత్రి అచ్చెన్నాయుడు కోరారు.
అమరావతి, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తనను కలిసేందుకు వచ్చే వారు బొకేలు, గజమాలలు, దుశ్శాలువాలు తీసుకురావద్దని మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. వాటికి పెట్టే ఖర్చుతో చదువుకునే పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు అందించాలని సూచించారు. తనకు శుభాకాంక్షలు చాలని ఆదివారం పేర్కొన్నారు.
Updated Date - Dec 30 , 2024 | 04:26 AM