Venigandla Ramu: అయ్యా.. కొడాలి నాని.. ప్రజలను మనుషులుగా గుర్తించు!
ABN, Publish Date - Jan 29 , 2024 | 06:38 PM
ఏపీలో రహదారులు అధ్వానంగా ఉన్నాయని.. కొండకోనల్లో ఉన్నామ అన్నట్లుగా.. నందివాడ మండల రహదారులు ఉన్నాయని గుడివాడ టీడీపీ ఇంచార్జ్ వెనిగండ్ల రాము(Venigandla Ramu) అన్నారు.
కృష్ణాజిల్లా (గుడివాడ): ఏపీలో రహదారులు అధ్వానంగా ఉన్నాయని.. కొండకోనల్లో ఉన్నామ అన్నట్లుగా.. నందివాడ మండల రహదారులు ఉన్నాయని గుడివాడ టీడీపీ ఇంచార్జ్ వెనిగండ్ల రాము(Venigandla Ramu) అన్నారు. రాము ఆధ్వర్యంలో సోమవారం నాడు మండల కేంద్రమైన నందివాడ గ్రామంలో " బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ " కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ, జనసేన పార్టీల శ్రేణులతో కలిసి ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెనిగండ్ల రాము మాట్లాడుతూ... ‘అయ్యా ఎమ్మెల్యే ప్రజలను మనుషులుగా గుర్తించు.. ఒక్కసారి రోడ్లపైకి వస్తే ప్రజల కష్టాలెంటే తెలుస్తాయి’ అని వెనిగండ్ల రాము అన్నారు.
పనికిరాని వ్యక్తినా మనం ఎన్నుకున్నది అని ప్రజలందరూ బాధపడుతున్నారని చెప్పారు. చేసిన తప్పు తెలుసుకుని టీడీపీ. జనసేన కూటమికి మద్దతు తెలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. నందివాడ మండల ప్రగతికి చేయూతనిచ్చేలా ఆక్వాహాబ్ ఏర్పాటు చేస్తామని ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారన్నారు. పాలకులకు తీరిక లేకపోయినా, నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి తాను చొరవ తీసుకుంటున్నానని తెలిపారు. మనమందరం కలిసి గుడివాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళదామని వెనిగండ్ల రాము పేర్కొన్నారు.
Updated Date - Jan 29 , 2024 | 08:02 PM