ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Excise Dept : సారాపై ఉక్కుపాదం

ABN, Publish Date - Dec 25 , 2024 | 05:18 AM

ఏపీ, తెలంగాణ రాష్ర్టాలకు చెందిన ఎక్సైజ్‌, పోలీసు శాఖల అధికారులు మంగళవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా సరిహద్దులోని ఎటపాక మండలంలో రెండు గ్రామాల్లో సారా స్థావరాలపై ఆకస్మిక దాడి చేశారు.

  • ఏపీ, తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో సంయుక్త దాడులు

  • ఎటపాక మండలంలో భారీగా బెల్లం ఊట, సారా ధ్వంసం

అమరావతి, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఏపీ, తెలంగాణ రాష్ర్టాలకు చెందిన ఎక్సైజ్‌, పోలీసు శాఖల అధికారులు మంగళవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా సరిహద్దులోని ఎటపాక మండలంలో రెండు గ్రామాల్లో సారా స్థావరాలపై ఆకస్మిక దాడి చేశారు. మొదట గుండువారిగూడెం గ్రామంలో సారా తయారీకి సిద్ధంగా ఉన్న 18,500 లీటర్ల బెల్లం ఊట, 200 లీటర్లను ధ్వంసం చేశారు. సారా తయారీకి ఉపయోగించే 100 డ్రమ్‌లు, ఇతర ఉపకరణాలనూ ధ్వంసం చేశారు. ఆ తర్వాత పిచ్చుకులపాడు అనే గ్రామానికి వెళ్లగా, దాడుల సమాచారం ముందే తెలుఉకుని సారా దొరక్కుండా ఇతర ప్రాంతాలకు తరలించారు. అధికారులు రెండు గ్రామాల్లోనూ అవగాహన సదస్సులు నిర్వహించారు. ఎక్సైజ్‌ ఖమ్మం అసిస్టెంట్‌ కమిషనర్‌ గణేష్‌, విజయవాడ ఎస్‌టీఎఫ్‌ ఈఎస్‌ సింగంశెట్టి మధు, రంపచోడవరం ఏఈఎస్‌ నాగరాహుల్‌, కొత్తగూడెం ఏఈఎస్‌ కరమ్‌చంద్‌, ఎటపాట మండల రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

కాగా, రాష్ట్రంలో సారాను పూర్తిగా నిర్మూలించడమే ప్రభుత్వ లక్ష్యమని ఏపీ ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ రాహుల్‌దేవ్‌ శర్మ అన్నారు. సంయుక్త దాడులపై ఆయన స్పందిస్తూ... రెండు రాష్ర్టాల అధికారుల సమన్వయంతో ఈ దాడులు సాధ్యమైందన్నారు. సారాపై ఆధారపడి జీవిస్తున్న వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పిస్తామన్నారు.

Updated Date - Dec 25 , 2024 | 05:18 AM