ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Dadi Veerabhadra Rao: ఈనెల 3న టీడీపీలోకి దాడి వీరభద్రరావు

ABN, Publish Date - Jan 02 , 2024 | 05:00 PM

మాజీ మంత్రి దాడి వీరభద్రరావు (Former Minister Dadi Veerabhadra Rao), ఆయన కుమారులు రత్నాకర్, జై వీర్ తెలుగుదేశం ( TDP ) పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. వైసీపీ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతుండడంపై దాడి వీరభద్రరావు కుమారులు రత్నాకర్, జై వీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మా నాన్నగారు దాడివీరభద్రరావుతోపాటు.. మా కుటుంబ సభ్యులంతా వైసీపీకి రాజీనామా చేశాం. ఈనెల 3న అమరావతిలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ని కలిసి వారి సమక్ష్యంలో టీడీపీలో చేరుతాం’’ అని రత్నాకర్, జై వీర్ తెలిపారు.

అనకాపల్లి జిల్లా: మాజీ మంత్రి దాడి వీరభద్రరావు (Former Minister Dadi Veerabhadra Rao), ఆయన కుమారులు రత్నాకర్, జై వీర్ తెలుగుదేశం ( TDP ) పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. వైసీపీ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతుండడంపై దాడి వీరభద్రరావు కుమారులు రత్నాకర్, జై వీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మా నాన్నగారు దాడివీరభద్రరావుతోపాటు.. మా కుటుంబ సభ్యులంతా వైసీపీకి రాజీనామా చేశాం. ఈనెల 3వ తేదీన అమరావతిలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ని కలిసి వారి సమక్ష్యంలో టీడీపీలో చేరుతాం. వైసీపీకి రాజీనామా చేసి మా మాతృసంస్థ అయినా తెలుగుదేశం పార్టీలో చేరడం ఆనందంగా ఉంది. వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన లేఖను సీఎం జగన్మోహన్‌రెడ్డికి, సజ్జల రామకృష్ణారెడ్డికి సమర్పించాం.’’ అని రత్నాకర్, జై వీర్ పేర్కొన్నారు.

కాగా... మంగళవారం తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి (CM YS Jaganmohan Reddy) వీరభద్రరావు పంపించారు. తన అనుచరులతో కలిసి పార్టీని వీడుతున్నట్లు ఏకవాక్యంతో రాజీనామా లేఖ రాశారు. సీఎంతో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy), ఎంపీ విజయసాయిరెడ్డికి (MP Vijayasai Reddy)రాజీనామా లేఖను పంపించారు. రాజీనామాకు ముందు అనకాపల్లిలో వీరభద్రరావు తన వర్గీయులతో సమావేశమయ్యారు. అనంతరం అధికారికంగా తన రాజీనామా లేఖకు సీఎం జగన్‌ను పంపించారు. రాజకీయ భవిష్యత్తుపై త్వరలోనే ప్రకటన ఉంటుందని.. ఏ పార్టీలో చేరేది అప్పుడు చెబుతామని దాడి వీరభద్రరావు ప్రకటించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 02 , 2024 | 05:07 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising