ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Atchannaidu: ఖరీఫ్ సీజన్‌కు సంసిద్ధం కావాలి: మంత్రి అచ్చెన్న

ABN, Publish Date - Jul 21 , 2024 | 07:22 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్ సీజన్‌(kharif Season)కు పూర్తిస్థాయిలో సంసిద్ధం కావాలని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు(Minister Kinjarapu Atchannaidu) అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఖరీఫ్ సీజన్ కోసం 17.50లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సిద్ధం చేయాలని వ్యవసాయశాఖ అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

Minister Achchennaidu

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్ సీజన్‌(kharif Season)కు పూర్తిస్థాయిలో సంసిద్ధం కావాలని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు(Minister Kinjarapu Atchannaidu) అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఖరీఫ్ సీజన్ కోసం 17.50లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సిద్ధం చేయాలని వ్యవసాయశాఖ అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ప్రారంభ నిల్వలతో కలిపి 14లక్షల టన్నులు రాష్ట్రానికి చేరుకున్నట్లు ఆయన వెల్లడించారు.


మిగిలిన ఎరువులు సకాలంలో రైతులకు అందించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,321సహకార సంఘాల్లో రైతులకు విక్రయించేందుకు ఎరువులు సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. మిగిలిన లైసెన్స్ లేని సహకార సంఘాలకు తక్షణమే లైసెన్స్ మంజూరు చేసి ఎరువుల విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.

Updated Date - Jul 21 , 2024 | 07:22 PM

Advertising
Advertising
<