ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chandrababu: ఆ వైసీపీ నేతలను టీడీపీలోకి ఆహ్వానిస్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Feb 16 , 2024 | 09:13 PM

తెలుగుదేశం - జనసేన కూటమి పొత్తులకు సహకరించిన నేతలకు అధికారంలోకి రాగానే ప్రాధాన్యం కల్పిస్తామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు.

అమరావతి: తెలుగుదేశం - జనసేన కూటమి పొత్తులకు సహకరించిన నేతలకు అధికారంలోకి రాగానే ప్రాధాన్యం కల్పిస్తామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. శుక్రవారం నాడు టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సారి పొత్తులతో ఎన్నికలకు వెళ్తున్నందున టికెట్ రాలేదని ఏ ఒక్కరూ నిరుత్సాహపడొద్దని తెలిపారు. పార్టీని నమ్ముకుని ఉన్ననేతలకు టీడీపీ అధికారంలోకి రాగానే కచ్చితంగా గుర్తింపు, ప్రాధాన్యం ఇస్తానని హామీ ఇచ్చారు. సీఎం జగన్‌తో విసిగిపోయిన చాలామoది వైసీపీ నేతలు రాష్ట్రాభివృద్ధి కోసం తెలుగుదేశంలో చేరుతామని అంటున్నారని చెప్పారు. ఆ నేతలు మంచి వారై ఉండి, పార్టీకి పనికొస్తారనుకునే వాళ్లనే టీడీపీ లోకి తీసుకుంటున్నామని తెలిపారు. అలాంటి నేతల చేరికలను ప్రోత్సహించి కలిసి పనిచేయాలని టీడీపీ నేతలకు సూచించారు.

‘‘రా - కదలిరా’’ సభలు ముగియగానే మరో ‘‘ప్రజా చైతన్య యాత్ర’’ కు శ్రీకారం చుడతామని ప్రకటించారు. మరో 50రోజులే సమయం ఉన్నందున ప్రతీ ఒక్కరూ సీరియస్‌గా పని చేయాలని తెలిపారు. ఇప్పటి వరకూ జరిగిన బీసీ సాధికార సభలకు మంచి స్పందన వచ్చిందన్నారు. ప్రతీ నియోజకవర్గంలోనూ బీసీ సాధికార సభలు నిర్వహించి తీరాలని చెప్పారు. జగన్ తమని మోసం చేశారనే భావన ప్రతీ బీసీలోనూ ఉందని అన్నారు. బీసీల అభ్యున్నతి కోసమే ఏర్పడిన తెలుగుదేశంలో వారికెప్పుడూ ప్రాధాన్యం తగ్గదని చంద్రబాబు అన్నారు.

Updated Date - Feb 16 , 2024 | 09:26 PM

Advertising
Advertising