TDP - JANASENA: చంద్రబాబు, పవన్ కీలక భేటీ.. చర్చించిన అంశాలివే..
ABN, Publish Date - Jan 13 , 2024 | 08:37 PM
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Nara Chandrababu Naidu )తో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి కాసేపటి క్రితమే పవన్ వచ్చారు.
అమరావతి: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Nara Chandrababu Naidu )తో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి కాసేపటి క్రితమే పవన్ వచ్చారు. సంక్రాంతి సందర్భంగా పవన్‌ను భోజనానికి చంద్రబాబు ఆహ్వానించారు. ఈ సమావేశంలో నారా లోకేష్‌తో పాటు నాదెండ్ల మనోహర్, ఇరు పార్టీలకు చెందిన కీలక నేతలు కూడా పాల్గొన్నారు. తెలుగుదేశం - జనసేన సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో బీజేపీతో పొత్తు, జనసేన టీడీపీ సీట్ల సర్దుబాటు, ఇతర పార్టీల నుంచి వస్తున్న వలసలపై చర్చించారు. అయితే ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని అన్ని విధాలుగా పరిశీలించిన తర్వాతే పార్టీలోకి ఆహ్వానించాలని బాబు, పవన్ నిర్ణయం తీసుకున్నారు. నాలుగున్నరేళ్లుగా ప్రజల్లో వ్యతిరేకత , అవకాశవాదం కోసం వచ్చే నాయకులను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలోకి తీసుకోవద్దని నిర్ణయం తీసుకున్నారు. కూటమి తొలి జాబితా సిద్ధం చేసిన అనంతరం ఉమ్మడిగా కలిసి జాబితాను విడుదల చేయాలని బాబు, పవన్ నిర్ణయం తీసుకున్నారు.
తొలి జాబితాపై స్ఫష్టత
తొలి జాబితాలో టీడీపీ - జనసేన నుంచి ఎవరెవరు పేర్లు ప్రకటించాలన్న దానిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఓ అవగాహన కొచ్చారు. ఇప్పటికే వైసీపీ మూడు జాబితాలు విడుదల చేయడంతో అభ్యర్థుల కస్తరత్తుపై ఇద్దరు నేతలు మరింత వేగం పెంచనున్నారు. భవిష్యత్ కార్యాచరణతో పాటు టీడీపీ - జనసేన తొలి జాబితా విడుదలపై అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. రేపు ( ఆదివారం) తెల్లవారుజామున అమరావతిలోని మందడంలో భోగి మంటల వేడుకలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు పాల్గొననున్నారు. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ప్రజా వ్యతిరేక జీవోలను భోగి మంటల్లో దగ్ధం చేయనున్నారు. ఇరువురి నేతల రాక సందర్భంగా టీడీపీ, జనసేన సిద్ధాంతాలు ప్రతబింభించేలా ముగ్గులు వేయనున్నారు. నాలుగేళ్లుగా పండగ లేకుండా ఉన్నా.. చంద్రబాబు, పవన్ కలిసి రావడంపై రెండు పార్టీల్లోని కేడర్ హర్షం వ్యక్తం చేశారు. అలాగే వీరితో పాటు భోగిమంటల్లో ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక జీవోలను వేస్తామని రైతులు అన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి గట్టిగా బుద్ది చెబుతామని రైతులు తీవ్రంగా హెచ్చరించారు.
Updated Date - Jan 13 , 2024 | 08:48 PM