ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: వైసీపీ అభ్యర్థి వంగా గీతకు చుక్కెదురు

ABN, Publish Date - Apr 24 , 2024 | 09:31 AM

పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతాకు చేదు అనుభవం ఎదురైంది. సమస్యలు పరిష్కరించకుండా ఓట్లడగడానికి వస్తారా..? అంటూ మహిళలు నిలదీశారు. పిఠాపురంలోని గొల్లప్రోలు పట్టణంలోని 20వ వార్డులో ఈ పరిస్థితి ఎదురైంది. మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల వెనుక వీధిలో ప్రచారం నిర్వహిస్తూ రోడ్డు పక్కన ఇళ్లలో ఉన్న మహిళలను పిలిచారు...

పిఠాపురం/గొల్లప్రోలు, ఏప్రిల్‌ 23: పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతాకు (Vagna Geetha) చేదు అనుభవం ఎదురైంది. సమస్యలు పరిష్కరించకుండా ఓట్లడగడానికి వస్తారా..? అంటూ మహిళలు నిలదీశారు. పిఠాపురంలోని గొల్లప్రోలు పట్టణంలోని 20వ వార్డులో ఈ పరిస్థితి ఎదురైంది. మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల వెనుక వీధిలో ప్రచారం నిర్వహిస్తూ రోడ్డు పక్కన ఇళ్లలో ఉన్న మహిళలను పిలిచారు. తమకు తాగునీరు లేదు, రోడ్లు, డ్రైన్లు అధ్వానంగా ఉన్నాయని, సుద్దగడ్డ కాలువలకు వరదలు వస్తే వరద నీటితో సహవాసం చేస్తున్నామని, ఇన్ని సమస్యలతో సతమతమవుతున్నా పరిష్కరించరు కానీ.. మీరు ఓట్లడగడానికి వస్తే మేము రావాలా..? అంటూ స్థానిక మహిళలు నిలదీశారు. మహిళలు వాదించడానికి ఒకట్రెండుసార్లు ప్రయత్నించిన గీత.. మరిన్ని ప్రశ్నలు ఎదురవ్వడంతో చేసేదేమీ లేక అక్కడ్నుంచి వెళ్లిపోయారు.

Kodali Nani: ఎన్నికల ప్రచారంలో కొడాలికి చేదు అనుభవం.. సీన్ కట్ చేస్తే...!!


For More Andhra Pradesh News and Telugu News

Updated Date - Apr 25 , 2024 | 07:43 AM

Advertising
Advertising