Share News

Kodali Nani: ఎన్నికల ప్రచారంలో కొడాలికి చేదు అనుభవం.. సీన్ కట్ చేస్తే...!!

ABN , Publish Date - Apr 25 , 2024 | 04:02 AM

గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నానికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. .

Kodali Nani: ఎన్నికల ప్రచారంలో కొడాలికి చేదు అనుభవం.. సీన్ కట్ చేస్తే...!!
Kodali Nani

  • ఎన్నికల ప్రచారంలో అనుచరుల వీరంగం.. యువకులపై దాడి

  • నా కొడుకును తెచ్చివ్వండని నానిని నిలదీసిన యువకుడి తల్లి

  • అల్లరి కాకుండా రూ.50 వేలు చేతిలో పెట్టి వెనుదిరిగిన నాని

  • గుడ్లవల్లేరు మండలం కూరాడలో ఘటన

విజయవాడ, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నానికి (Kodali Nani) ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. గుడ్లవల్లేరు మండలం కూరాడ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు మంగళవారం రాత్రి కొడాలి నాని వచ్చారు. గ్రామంలో ఓ ఆలయానికి సహాయం చేస్తానని గతంలో కొడాలి నాని హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని గ్రామస్థులు నాని వద్ద ప్రస్తావించారు. అదే సమయంలో అక్కడే ఉన్న కొందరు యువకులు.. ‘ఆయనేంటి చేసేది.. కోతలు తప్ప ఏ పనులూ చేయడం చేతకాదు’ అంటూ మాట్లాడారు. దీంతో నాని వెంట ఉన్న పాలేటి చంటి, మరికొందరు అనుచరులు.. వారిపై దాడికి దిగారు. భయభ్రాంతులకు లోనైన యువకులు అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయారు.

ఆ తర్వాత గ్రామంలో పర్యటిస్తున్న నాని వద్దకు బాధిత యువకుడి తల్లి వచ్చి.. ‘నా కొడుకుపై నీ మనుషులు దాడి చేశారు. మీరు చంపేస్తారన్న భయంతో వాడు ఎక్కడికో వెళ్లిపోయాడు. నా కొడుకును తెచ్చి అప్పగించండి’ అంటూ నిలదీసింది. ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక కొడాలి కాసేపు మౌనంగా ఉండి పోయారు. విషయం అల్లరవుతుందనే ఉద్దేశంతో.. ‘మీ ఇంటికి వెళుదాం పద’ అంటూ ఆమె ఇంటికి వెళ్లారు. ఆమెను బుజ్జగించి రూ. 50 వేలు చేతిలో పెట్టి వెనుదిరిగారు.

Updated Date - Apr 25 , 2024 | 08:04 AM