Chandrababu: ఎన్నికల్లో ప్రజలు బటన్ నొక్కితే జగన్ మైండ్ బ్లాంక్ కావాలి
ABN, First Publish Date - 2024-02-06T16:42:49+05:30
రాబోయే ఎన్నికల్లో ప్రజలు బటన్ నొక్కితే సీఎం జగన్ మైండ్ బ్లాంక్ కావాలని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అన్నారు.
చిత్తూరు: రాబోయే ఎన్నికల్లో ప్రజలు బటన్ నొక్కితే సీఎం జగన్ మైండ్ బ్లాంక్ కావాలని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అన్నారు. మంగళవారం చిత్తూరు, గంగాధర, నెల్లూరు ‘‘ రా.. కదలిరా’’ సభల్లో జగన్‌పై చంద్రబాబు నిప్పులు చెరిగారు. విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చామని అన్నారు. పేదరికం లేని రాష్ట్రాన్ని చూడాలనేది తన జీవితాశయమని తెలిపారు. పెరిగిన సంపద పేదలకు చేరాలనేది తన సంకల్పమని అన్నారు. తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్‌వన్‌గా ఉండాలని చంద్రబాబు ఆకాక్షించారు.
ఏపీలో హింసా రాజకీయాలు
► వైసీపీను ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
► రాతియుగం వైపు ఏపీ వెళ్లకుండా స్వర్ణయుగం వైపు వెళ్లాలి.
► ఓడిపోతామని తెలిసి జగన్ మానసిక ఆందోళనలో ఉన్నారు.
► వైసీపీ హయాంలో ప్రజలపై ధరల పెంపుతో పాటు పన్నుల భారం మోపారు.
► రాష్ట్రంలో హింసా రాజకీయాలు పెరిగిపోయాయి.
► ఏపీలో ఉపాధి లేక వలస వెళ్లే దుస్థితి ఉంది.
► వలంటీర్లకు తాము వ్యతిరేకం కాదు.. ప్రజలకు సేవ చేయాలి.
► వలంటీర్లు వైసీపీకు సేవ చేస్తే టీడీపీ అధికారంలోకి వచ్చాక వదిలిపెట్టం.
► జగన్‌ను నమ్ముకుంటే వలంటీర్లు జైలుకు వెళ్లాల్సిందే.
► టీడీపీ అధికారంలోకి వస్తే.. వలంటీర్ ఉద్యోగాలు తీసేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
► వలంటీర్లలో జగన్ అభద్రతా భావాన్ని సృష్టిస్తున్నారని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2024-02-06T16:56:18+05:30 IST