ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Politics: వాలంటీర్లపై వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం.. వివరణ ఇచ్చిన అచ్చెన్న..

ABN, Publish Date - Mar 26 , 2024 | 02:15 PM

వాలంటర్లపై టీడీపీ నతే బొజ్జల సుధీర్ రెడ్డి(Bojjala Sudheer Reddy) చేసిన వ్యాఖ్యలపై అచ్చెన్నాయుడు(Kinjarapu Atchannaidu) క్లారిటీ ఇచ్చారు. సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని స్పష్టం చేశారు. శ్రీకాళహస్తి(Srikalahasti) నియోజకవర్గంలో మాట్లాడిన బొజ్జల సుధీర్ రెడ్డి వాలంటీర్లపై వివాదాస్పద కామెంట్స్ చేశారు. దీనిపై స్పందించిన అచ్చెన్నాయుడు క్లారిటీ ఇచ్చారు.

Atchennaidu

అమరావతి, మార్చి 26: వాలంటర్లపై టీడీపీ నతే బొజ్జల సుధీర్ రెడ్డి(Bojjala Sudheer Reddy) చేసిన వ్యాఖ్యలపై అచ్చెన్నాయుడు(Kinjarapu Atchannaidu) క్లారిటీ ఇచ్చారు. సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని స్పష్టం చేశారు. శ్రీకాళహస్తి(Srikalahasti) నియోజకవర్గంలో మాట్లాడిన బొజ్జల సుధీర్ రెడ్డి వాలంటీర్లపై వివాదాస్పద కామెంట్స్ చేశారు. దీనిపై స్పందించిన అచ్చెన్నాయుడు క్లారిటీ ఇచ్చారు. సుధీర్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని అన్నారు. అధికారంలోకి రాగానే వాలంటీర్లకు మెరుగైన జీతభత్యాలు, సదుపాయాలు కల్పిస్తామని చంద్రబాబు గతంలోనే ప్రకటించారని గుర్తు చేశారు. టీడీపీ దానికే కట్టుబడి ఉందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ప్రభుత్వ నియమ నిబంధనలు, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి బియ్యపు మథుసూదన్ రెడ్డితో కుమ్మక్కై ఆగడాలు సృష్టిస్తున్న వాలంటీర్లపైనే సుధీర్ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు.

అలాంటి వారిని సమర్థించం..

వైసీపీ నేతల చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అరాచకం చేస్తున్న వాలంటీర్లను తెలుగుదేశం పార్టీ సమర్థించదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఇప్పటికే ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి 200 మందికి పైగా వాలంటీర్లు సస్పెండ్ అయ్యారని, వారి భవిష్యత్‌ను పాడు చేసుకున్నారని అన్నారు. జగన్ రెడ్డి అవినీతికి వత్తాసు పలికిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే జైలుకు వెళ్లినా పట్టించుకోలేదన్నారు. వాలంటీర్లు చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనవద్దని అచ్చెన్నాయుడు కోరారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 26 , 2024 | 02:15 PM

Advertising
Advertising