ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

NAMINATONS FINAL : హమ్మయ్యా..!అన్నీ ఓకే..!

ABN, Publish Date - Apr 27 , 2024 | 12:59 AM

జిల్లాలో పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన శుక్రవారం పూర్తి అయ్యింది. ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లు అన్నీ ఆమోదం పొందడంతో ఆయా పార్టీల నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. ఎంపీ స్థానానికి 21 మంది నామినేషన్లు, ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు 136 మంది నామినేషన్లు ఆమోదం పొందాయి. షెడ్యూల్‌ మేరకు ఈ నెల 18నుంచి 25 వరకు అనంతపురం ఎంపీ, ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు ...

Officials examining MP nominations in Collectorate

ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం

అసెంబ్లీ స్థానాలకు 136 ఆమోదం.. 44 తిరస్కరణ

ఎంపీ స్థానానికి 21 ఆమోదం.. నాలుగు తిరస్కరణ

ఉపసంహరణకు 29 వరకూ గడువు

అనంతపురం టౌన, ఏప్రిల్‌ 26: జిల్లాలో పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన శుక్రవారం పూర్తి అయ్యింది. ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లు అన్నీ ఆమోదం పొందడంతో ఆయా పార్టీల నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. ఎంపీ స్థానానికి 21 మంది నామినేషన్లు, ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు 136 మంది నామినేషన్లు ఆమోదం పొందాయి. షెడ్యూల్‌ మేరకు ఈ నెల 18నుంచి 25 వరకు అనంతపురం ఎంపీ, ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు నామినేషన్లును స్వీకరించారు. ఎంపీ స్థానానికి 25 మంది అభ్యర్థులు 38 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు 180 మంది అభ్యర్థులు 285 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇవన్నీ ఎన్నికల కమిషన నిబంధనల మేరకు ఉన్నాయా లేదా అని శుక్రవారం పరిశీలించారు.


- కలెక్టరేట్‌లో ఎంపీ స్థానానికి వచ్చిన నామినషన్లను ఎన్నికల సాధారణ వ్యవహారాల కేంద్ర పరిశీలకులు అజయ్‌నాథ్‌, జిల్లా ఎన్నికల అధికారి వినోద్‌కుమార్‌, ఏఆర్‌ఓ రమే్‌షరెడ్డి పర్యవేక్షణలో పరిశీలించారు. సరైన సమాచారం నమోదు చేయనందుకు నలుగురి నామినేషన్లను తిరస్కరించారు. మిగిలిన 21 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించారు. ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌, సీపీఐ తరఫున దాఖలైన నామినేషన్లు ఆమోదం పొందాయి.

- జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు దాఖలైన 285 నామినేషన సెట్స్‌ను ఆయా నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు శుక్రవారం పరిశీలించారు. ఇందులో 136 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి. సరైన సమాచారం పొందుపరచని 44 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు.

- నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకు గడువు ఉంది. ఆ తర్వాత ఎన్నికల బరిలో ఏ ఏ నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారో అధికారులు ప్రకటిస్తారు. అభ్యర్థులు మే 11 వరకు ప్రచారం చేసుకోవచ్చు. మే 13న పోలింగ్‌, జూన 4న కౌంటింగ్‌ జరుగుతుంది.

మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 27 , 2024 | 12:59 AM

Advertising
Advertising