ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

POLICE : శాంతి.. భద్రమేనా..!

ABN, Publish Date - May 13 , 2024 | 12:09 AM

జిల్లాలో పోలింగ్‌ నిర్వహణ పోలీసులకు సవాలు కానుంది. శాంతిభద్రతలకు విఘాతంగా కలగకుండా వారు ఏ మేరకు చర్యలు తీసుకోగలరనేది చర్చనీయాంశంగా మారింది. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు వైసీపీ నేతలు కుయుక్తులు పన్నుతున్నట్లు సమాచారం. ఎక్కడైనా తేడా కొడితే అల్లర్లు సృష్టించాలని కొందరు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. జిల్లాలోని రాప్తాడు, తాడిపత్రి, ఉరవకొండ నియోజకవర్గాలపైనే అందరి దృష్టి ఉంది. ఇక్కడ ఓటర్లను భయబ్రాంతులకు గురిచేసేందుకు, ప్రలోభ పెట్టడానికి అనేక ..

పోలింగ్‌ నిర్వహణ కత్తిమీద సాము

తాడిపత్రి, రాప్తాడు, ఉరవకొండ.. సమస్యాత్మకం

వైసీపీ కవ్వింపులు.. బెదిరింపులు ఇక్కడ కామన

భారీగా పోలీసు భద్రత.. అయినా అనుమానాలు

అనంతపురం క్రైం, మే 12: జిల్లాలో పోలింగ్‌ నిర్వహణ పోలీసులకు సవాలు కానుంది. శాంతిభద్రతలకు విఘాతంగా కలగకుండా వారు ఏ మేరకు చర్యలు తీసుకోగలరనేది చర్చనీయాంశంగా మారింది. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు వైసీపీ నేతలు కుయుక్తులు పన్నుతున్నట్లు సమాచారం. ఎక్కడైనా తేడా కొడితే అల్లర్లు సృష్టించాలని కొందరు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. జిల్లాలోని రాప్తాడు, తాడిపత్రి, ఉరవకొండ నియోజకవర్గాలపైనే అందరి దృష్టి ఉంది. ఇక్కడ ఓటర్లను భయబ్రాంతులకు గురిచేసేందుకు, ప్రలోభ పెట్టడానికి అనేక విధాలుగా ఇప్పటికే ప్రయత్నించారు. ఎన్నికల్లో టీడీపీ కూటమి, వైసీపీ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ పోలింగ్‌ జరిగే సుమారు 12 గంటల పాటు ఎలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులదే. ప్రజలు నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే వాతావరణాన్ని వారే కల్పించాల్సి ఉంది.

అధికారం - పోలీస్‌ - కేసులు


వైసీపీ నేతలు ఐదేళ్ల పాటు తమకు నచ్చిన, అనుకూలంగా ఉన్న, పార్టీ సామాజికవర్గానికి చెందిన పోలీసు అధికారులకే పెద్దపీట వేసింది. టీడీపీ వర్గీయులపై దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసుల పరంపర కొనసాగించారు. సామాన్యులను సైతం భయబ్రాంతులకు గురి చేశారు. అయినా పోలీసులు చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించలేదు. రాప్తాడు సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌ శ్రీకృష్ణపై దాడి చేసిన కేసులో నిందితుడు ఎర్రిస్వామిని రాచమర్యాదలతో జైలుకు పంపారు. దాడిలో పాల్గొన్న కనగానపల్లికి చెందిన బండి రవి, కళ్యాణదుర్గం ప్రాంతానికి చెందిన అశోక్‌ను టచకూడా చేయలేదు. పరారీలో ఉంటూనే.. టీడీపీ కార్యర్తలపై బండి రవి దాడిచేసి.. పోలీసులు తనకు ఇచ్చిన ‘స్వేచ్ఛ’ ఏ స్థాయిదో చూపించాడు. ఆత్మకూరు మండలంలో ఇంటికెళ్లి టీడీపీ కార్యకర్త వన్నూరును బెదిరించారు. అనంతపురం రూరల్‌ డీఎస్పీ బీవీ శివారెడ్డి తనకేమీ సంబంధం లేనట్లు వ్యవహరించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అరాచకాలు ఉన్నాయి.

ఒకరికి మించి ఒకరు..

ఎస్పీ ఫక్కీరప్ప ఉన్నన్నాళ్లూ వైసీపీతో అంటకాగారు. ఆ తరువాత వచ్చిన ఎస్పీ శ్రీనివాసులుపై ‘వైసీపీ’ డీఐజీ అమ్మిరెడ్డి పెత్తనం చెలాయించారు. ఇక కడప నుంచి నేరుగా వైసీపీ రంగులు పూసుకుని మీర అన్బురాజన వచ్చారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పినట్లు వ్యవహరించి.. పోలీసు శాఖకు మచ్చ తెచ్చారు. డీఐజీ అమ్మిరెడ్డి.. రెడ్డి సామాజికవర్గం పోలీసులనే ప్రోత్సహించారు. ఎన్నికల


ముందు టీడీపీకి అనుకూలంగా ఉంటారనే నెపంతో కొందరిని స్టేషన్లలో ఉంచకుండా చెక్‌పోస్టులకు పంపారు. తాడిపత్రి డీఎస్పీగా ఉన్న చైతన్యకుమార్‌ అరాచకాలు ఏ స్థాయిలో సాగాయో తెలియంది కాదు. అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి మూడేళ్లు కరడుగట్టిన వైసీపీ అధికారిగా పనిచేశారు. వైసీపీ నాయకుడిపై జరిగిన దాడి కేసులో సంబంధం లేని టీడీపీ నాయకులను చేర్చారు. ఆయనతోపాటు ఎస్పీ అన్బురాజన, డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు వేసింది.

ఏం చేస్తారో..

జిల్లాలోని వివిధ పోలీస్‌ స్టేషన్లలో వైసీపీ నేతల సిఫార్సులతో వచ్చిన కొందరు పోలీస్‌ అధికారులు తిష్ట వేశారు. ఎస్‌ఐ నుంచి డీఎస్పీ వరకు వారిలో ఉన్నారు. ఇక అంతకు కింది స్థాయి సిబ్బంది సరేసరి. పోలింగ్‌ రోజున వీరు ఎలా వ్యవహరిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. పోలీసు ఉన్నతాధికారులపై ఎన్నికల కమిషన వేటు వేసిన నేపథ్యంలో కొందరిలో మార్పు కనిపిస్తోంది. కానీ వైసీపీ నేతల తాయిలాల ప్రభావం గురించి అనుమానాలు ఉన్నాయి.


ఆ మూడే కీలకం...

రాప్తాడు నియోజకవర్గంలో గొడవలు తప్పవని స్పష్టమవుతోంది. ఇంతకాలం పోలీసులు వైసీపీకే అనుకూలంగా వ్యవహరించారు. కనీసం పోలింగ్‌ రోజైనా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తారా..? అనేది తేలాల్సి ఉంది. తాడిపత్రి సైతం ఈసారి హాట్‌ హాట్‌గానే ఉంది. అక్కడి నేతలు సవాళ్లు.. ప్రతి సవాళ్లతో వేడి రగిల్చారు. ఉరవకొండలోనూ వైసీపీ నేతలు తమ ప్రాభవాన్ని చూపాలని అనుకుంటున్నారు. రౌడీయిజంతో రెచ్చిపోయే మూకలను పోలీసులు కట్టడి చేస్తేనే ఎన్నికలు ప్రశాంతంగా సాగుతాయి. భయబ్రాంతాలకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అమిత బర్దర్‌ హెచ్చరించారు. పోలింగ్‌ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో ఉండాలని స్పష్టం చేశారు. శాంతిభద్రతలపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - May 13 , 2024 | 12:09 AM

Advertising
Advertising