ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

NOMINATIONS : ఎంపీకి 38.. ఎమ్మెల్యేలకు 220 పైగా..

ABN, Publish Date - Apr 25 , 2024 | 11:48 PM

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పక్రియ గురువారం ముగిసింది. ఈనెల 18 నుంచి జిల్లాలో అనంత పార్లమెంటు స్థానానికి, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు జిల్లా యంత్రాంగం నామి నేషన్లు స్వీకరించింది. వివరాలు ఇలా..

Collector Vinod Kumar giving orders to the officials

ముగిసిన నామినేషన్ల గడువు

అనంతపురం టౌన, ఏప్రిల్‌ 25: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పక్రియ గురువారం ముగిసింది. ఈనెల 18 నుంచి జిల్లాలో అనంత పార్లమెంటు స్థానానికి, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు జిల్లా యంత్రాంగం నామి నేషన్లు స్వీకరించింది. వివరాలు ఇలా..

అనంత పార్లమెంటుకు 38..

అసెంబ్లీ స్థానాలకు 220కుపైగా ..

నేడు నామినేషన్ల పరిశీలన

ఉపసంహరణకు 29వరకు గడువు

మే 13న ఎన్నికలు

జూన 4న ఓట్ల లెక్కింపు, ఫలితాలు


నేటితో పోస్టల్‌బ్యాలెట్‌కు ఆఖరిగడువు

పోస్టల్‌బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి శుక్రవారం చివరిరోజు అని కలెక్టరు వినోద్‌కుమార్‌ తెలిపారు. ఎన్నికల డ్యూటీలో ఉన్న ప్రతి శాఖ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఓటుకోసం ఫారం-12ను పనిచేసే నియోజవర్గ ఆర్‌ఓలకు ఇవ్వాలని కలెక్టరు కోరారు.

పరిశీలన పక్కాగా చేపట్టాలి: కలెక్టర్‌

అనంతపురం టౌన, ఏప్రిల్‌ 25: నామినేషన్ల స్ర్కూట్నీ పక్రియను పక్కాగా చేపట్టాలని కలెక్టరు డాక్టర్‌ వినోద్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స ద్వారా స్ర్కూట్నీపై రిటర్నింగ్‌ అధికారులతో మాట్లాడారు. శుక్రవారం షెడ్యూల్‌ మేరకు నామినేషన్ల పరిశీలన (స్ర్కూట్నీ) జరగుతుందన్నారు.


పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలకు వచ్చిన నామినేషన్లను పక్కాగా పరిశీలించాలన్నారు. ఇందుకు ఆయా నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. పరిశీలనపై ఎక్కడైనా, ఏమైనా సందేహాలు వస్తే వెంటనే వాటిని నివృత్తి చేసుకొని పకడ్బందీగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.

మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 25 , 2024 | 11:48 PM

Advertising
Advertising