ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Batti vikramarka: ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా బీఆర్‌ఎస్‌, బీజేపీ

ABN, First Publish Date - 2023-03-04T15:23:07+05:30

బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారాయని సీఏల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: బీఆర్‌ఎస్ (BRS), బీజేపీ (BJP) పార్టీలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారాయని సీఏల్పీ నేత భట్టి విక్రమార్క (CLP Leader Batti Vikramarka) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... ప్రజల సొమ్మును కొద్ది మంది పెద్దలకే బీజేపీ పంచి పెట్టిన విషయాన్ని రాహుల్ (Rahul Gandhi) జోడో యాత్ర (Bharat jodo Yatra) లో ప్రజలకు‌ చాటి చెప్పారన్నారు. దేశాన్ని బీజేపీ మత ప్రాతిపదికన విడదీస్తోందని విమర్శించారు. అదానీ (Adani)కి ప్రధాని మోదీ (PM Narendra Modi) పంచిన సొమ్ముపై హిండెన్‌బర్గ్ రిపోర్ట్ (Hindenburg Report) ఇచ్చిందని ఆయన తెలిపారు.

బీఆర్‌ఎస్ ప్రమాదకరంగా మారిందని అన్నారు. కాళేశ్వరం (Kaleswaram Project) కట్టి లక్షల కోట్లు తిన్నారని.. ప్రాజెక్టు నుంచి చుక్క నీరు పారలేదని వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టుకు కాల్వలు తవ్వకుండా నీళ్లు ఎట్ల ఇస్తరని ప్రశ్నించారు. కృష్ణా నదిపై పాలమూరు (Palamuri Project) తప్ప కొత్త ప్రాజెక్టేది అని నిలదీశారు. అన్నీ కూడా కాంగ్రెస్ (Congress) కట్టినవే అని ఆయన అన్నారు. కాంగ్రెస్ సృష్టించిన సంపదతోనే హైదరాబాద్‌ (Hyderabad) లో భూముల రేట్లు పెరిగాయని.. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) అమ్మేస్తోందన్నారు. 24 గంటల కరెంట్ ఇస్తున్నామని గొప్పలు చెబుతున్నారని.. కానీ కాంగ్రెస్ కట్టిన కరెంట్ ప్రాజెక్టులతోనే సాధ్యమవుతోందని తెలిపారు. బీఆర్‌ఎస్ కట్టిన కొత్త ప్రాజెక్టు ఒక్కటి కూడా లేదని భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు.

Updated Date - 2023-03-04T15:23:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!