Amit Shah: ఈనెల 28న తెలంగాణకు అమిత్ షా
ABN, Publish Date - Dec 26 , 2023 | 05:36 PM
తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) ఈనెల 28వ తేదీన పర్యటించనున్నారు. ఈ మేరకు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేశారు. లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. తెలంగాణలో ఈసారి ఎలాగైనా ఎక్కువ స్థానాలను గెలిపించుకోవడమే లక్ష్యంగా బీజేపీ కేంద్ర నాయకత్వం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే కేడర్‌కి లోక్‌సభ ఎన్నికలపై అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్: తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) ఈనెల 28వ తేదీన పర్యటించనున్నారు. ఈ మేరకు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేశారు. లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. తెలంగాణలో ఈసారి ఎలాగైనా ఎక్కువ స్థానాలను గెలిపించుకోవడమే లక్ష్యంగా బీజేపీ కేంద్ర నాయకత్వం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే కేడర్‌కి లోక్‌సభ ఎన్నికలపై అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ పర్యటనలో భాగంగా చార్మినార్, భాగ్యలక్ష్మీ అమ్మవారికి అమిత్ షా ప్రత్యేకపూజలు చేయనున్నారు. తర్వాత బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. రంగారెడ్డి జిల్లా కొంగర్ కలాన్‌లో 1200మంది నేతలకు షా దిశానిర్దేశం చేయనున్నారు.
మండల అధ్యక్షుల నుంచి రాష్ట్ర అధ్యక్షుడు వరకు 1200మందికి ఈ సమావేశానికి ఆహ్వానం పంపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో చేపట్టాల్సిన వ్యూహంపై షా దిశానిర్దేశం చేయనున్నారు. అదే రోజు అసెంబ్లీలో బీజేపీ శాసనసభ పక్ష నేతను షా డిసైడ్ చేయనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మెదటిసారి తెలంగాణకు అమిత్ షా వస్తున్నారు. ఈ నేపథ్యంలో అమిత్ షా పర్యటనకు బీజేపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పర్యటనపై బీజేపీలో ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
Updated Date - Dec 26 , 2023 | 05:43 PM