T. Nageswara Rao: కాంగ్రెస్ ఆరు గ్యారంటీ పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతాయి
ABN, First Publish Date - 2023-11-21T22:00:06+05:30
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతాయని కాంగ్రెస్ పార్టీ ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao ) వ్యాఖ్యానించారు.
భద్రాద్రి కొత్తగూడెం: కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతాయని కాంగ్రెస్ పార్టీ ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao ) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు పాల్వంచలో సీపీఐ - కాంగ్రెస్ కూటమి అభ్యర్థి కూనంనేని సాంబశివరావు విజయాన్ని కాంక్షిస్తూ భారీ ర్యాలీ తీశారు. ఈ ర్యాలీ నవభారత్ సెంటర్, అంబేడ్కర్ సెంటర్, సూపర్ బజార్ సెంటర్‌ల మీదుగా సాగింది. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ...‘‘కొత్తగూడెం గెలిస్తెనే కాంగ్రెస్ పార్టీకి గౌరవం. వసూళ్లు చేసే నాయకుడు కావాలా.... నీతి మంతుడైన కూనంనేని కావాలా ఆలోచించుకోవాలి. రానున్న రోజుల్లో కొత్తగూడెం నెంబర్ వన్ జిల్లాగా అభివృద్ధి చెందుతుంది. కొత్తగూడెం నుంచి హైదరాబాద్ జాతీయ రహదారితో ప్రగతి బాటలు పడతాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పేదల సొంతింటి కల నెరవేరుతుంది. అన్నలు చంపుతారని కొందరు. అంటే చంపినా పర్వలేదని ఎర్రసాని వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేశా. రాజకీయ సేవ చేసే భాగ్యం దేవుడు ఎన్టీఆర్ ఇచ్చారు. సాంబశివరావు కంకి కొడవలి గుర్తుపై ఓటేసి గెలిపించాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాల్లో కాంగ్రెస్, సీపీఐ పార్టీల జెండా ఎగరాలి. మీ గౌరవాన్ని నిలిపే ఎన్నిక కూనంనేని ఎన్నిక. కాంగ్రెస్, సీపీఐ, తెలుగుదేశం టీజేఎస్ పార్టీలు ఏకమై కూనంనేనిని గెలిపించాలి’’ అని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
కాంగ్రెస్ పాలనలో కొత్తగూడెం అభివృద్ధి చేస్తాం
‘‘సాంబశివరావు ఎక్కడ టోల్ గేట్లు పెట్టలేదు. అవినీతి లేని నీతిమంతుడైన సాంబశివరావుని ఎన్నికల్లో గెలిపించాలి. విజయవాడ జగదల్‌పూర్ రహదారిని పూర్తి చేశాం. కొత్తగూడెంలో రహదారులు అభివృద్ధి చేశాను.నల్ల బంగారం ఆదివాసులు ఉన్న జిల్లా. కొత్తగూడెం నుంచి వయా ఇల్లందు మీదుగా జాతీయ రహదారి రూపకల్పన చేశాం. కాంగ్రెస్ పాలనలో కొత్తగూడెం అభివృద్ధి చేస్తాం. రిపోర్టర్‌గా ప్రస్థానం మొదలు పెట్టి శాసనసభలో అడుగు పెట్టారు. నీతి వంతమైన నేతలు చట్టసభల్లో ఉండాలని కూనంనేనికి కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉంది.కూనంనేని లాంటి నేతలు నాకు తోడుంటే కొత్తగూడెం అభివృద్ధి బాట పట్టిస్తా. నలబై ఏళ్లుగా రాజకీయ సేవ చేసే అవకాశం ఎన్టీఆర్ ఇచ్చారు.నీటి పారుదల రంగం రహదారుల రంగంలో అభివృద్ధిని చూపించా. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో కొత్తగూడెంలో చదివాను.రైల్వే అండర్ బ్రిడ్జి హాస్పిటల్....సుజాత నగర్ మండల కేంద్రం ఏర్పాటు చేశాను. సాంబశివరావును గెలిపిస్తే కొత్తగూడెం కార్పొరేషన్‌గా మారుస్తాం.జాతీయ రహదారులతో కొత్తగూడెం జిల్లాను ప్రగతి బాట పట్టించా. కొందరు మాఫియా మాదిరిగా మారి జిల్లాకు తలవంపులు తెస్తున్నారు.జిల్లా కీర్తి ప్రతిష్టలు పెరిగేలా భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులతో రాజకీయం చేశాను. నేను, పొంగులేటి మా జీవితాలు జిల్లా అభివృద్ధి కోసమే. సీపీఐ అభ్యర్థి కంకి కొడవలి గుర్తుపై ఓటేసి గెలిపించాలి’’ అని తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.
ఈ ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి మధ్య పోరాటం: పొంగులేటి
ఈ ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి మధ్య పోరాటమని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( Ponguleti Srinivasa Reddy ) అన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ..‘‘కాంగ్రెస్ - సీపీఐ కూటమి అభ్యర్థి కూనంనేనిని ఈఎన్నికల్లో గెలిపించాలి. పార్టీ నిర్ణయం మేరకు కొత్తగూడెంలో పోటీలో లేను. నేను తుమ్మల కూనంనేని అందరం ఒక్కటే. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఒక్కటే. ఇందిరమ్మ రాజ్యం రాబోతుంది’’ అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2023-11-21T22:00:07+05:30 IST