ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ధోనికి అభిమానులు కాదు.. భక్తులు ఉంటారనడానికి ఈ వీడియోనే సాక్ష్యం!

ABN, First Publish Date - 2023-08-28T19:11:07+05:30

మహేంద్ర సింగ్ ధోని. ఏ మాత్రం పరిచయం అవసరం లేని పేరు ఇది. చిన్నపెద్ద అనే తేడా లేకుండా మెజారిటీ వ్యక్తులకు ధోని గురించి తెలుసు. టీమిండియాకు రెండు ప్రపంచకప్‌లు అందించిన కెప్టెన్‌గా ధోని చరిత్రలో నిలిచిపోయాడు.

మహేంద్ర సింగ్ ధోని. ఏ మాత్రం పరిచయం అవసరం లేని పేరు ఇది. చిన్నపెద్ద అనే తేడా లేకుండా మెజారిటీ వ్యక్తులకు ధోని గురించి తెలుసు. టీమిండియాకు రెండు ప్రపంచకప్‌లు అందించిన కెప్టెన్‌గా ధోని చరిత్రలో నిలిచిపోయాడు. కెప్టెన్‌గానే కాకుండా ఆటతోనూ అభిమానుల హృదయ్యాల్లో చెరగని ముద్ర వేశాడు. దీంతో ధోనికి అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ధోనికి అభిమానులే కాకుండా విపరీతంగా ఆరాధించే భక్తులు కూడా ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలోనే అభిమానంతో ధోని పాదాలను తాకిన ఓ అమ్మాయి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో(Social Media) వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం ధోని కుర్చీలో కూర్చొని ఉండగా ఓ మహిళా అభిమాని ఆయన వద్దకు వచ్చింది. ధోని మాట్లాడుతుండగా ఆ అమ్మాయి ఆకస్మికంగా ధోని పాదాలకు దండం పెట్టుకుంది. దీంతో ధోని కూడా కాస్త ఆశ్చర్యానికి గురయ్యాడు. ఆ వెంటనే నవ్వుతూ ఆమెతో కరచాలనం చేశాడు. ఆ తర్వాత ఆ అమ్మాయితో ధోని ఫోటోలు కూడా దిగాడు. ధోని కలిసిన ఆనందంలో ఆ అమ్మాయి తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన పలువురు అభిమానులు ధోనికి అభిమానులు కాదు.. భక్తులు ఉంటారనడానికి ఇదే సాక్ష్యం అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇక ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించిన ధోని ప్రస్తుతం ఐపీఎల్‌లో కొనసాగుతున్నాడు. గత సీజన్‌లో తన కెప్టెన్సీలో చెన్నైసూపర్ కింగ్స్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. ఐపీఎల్‌లో సీఎస్కేను ధోని ఛాంపియన్‌గా నిలపడం ఇది ఐదో సారి. దీంతో ఐపీఎల్‌లో అత్యధిక టైటిల్‌లు గెలిచిన కెప్టెన్‌గా రోహిత్ శర్మతో కలిసి ధోని మొదటి స్థానంలో ఉన్నాడు. 42 ఏళ్ల ధోనికి గత ఐపీఎల్ సీజనే చివరిదనే ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ ఇప్పటివరకు ధోని అలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ధోని వచ్చే సీజన్‌లోనూ ఆడే అవకాశాలున్నాయి.

Updated Date - 2023-08-28T19:11:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising