ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sachin Tendulkar: వాంఖడేలో నేడు క్రికెట్ దేవుడి విగ్రహావిష్కరణ

ABN, First Publish Date - 2023-11-01T10:58:31+05:30

ప్రముఖ క్రికెట్ స్టేడియం వాంఖడేలో నేడు భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. సచిన్ స్టాండ్స్ పక్కనే ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. సచిన్ ఐకానిక్ షాట్లలో ఒకటైన ఆఫ్‌సైడ్ షాట్ ఆడుతున్నట్టుగా విగ్రహాన్ని ఏర్పాటుచేశారు.

ముంబై: ప్రముఖ క్రికెట్ స్టేడియం వాంఖడేలో నేడు భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. సచిన్ స్టాండ్స్ పక్కనే ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. సచిన్ ఐకానిక్ షాట్లలో ఒకటైన ఆఫ్‌సైడ్ షాట్ ఆడుతున్నట్టుగా విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. కాగా వాంఖడే స్టేడియం సచిన్‌కు హోంగ్రౌండ్ అనే సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, బీసీసీఐ కార్యదర్శి జైషా, బీసీసీఐ కోశాధికారి ఆశిష్ షెలార్ హాజరుకాన్నున్నారు. స్వయంగా సచిన్ టెండూల్కర్ కూడా ఈ కార్యకమంలో పాల్గొననున్నారు. వారంతా కలిసి సచిన్ విగ్రహాన్ని ఆవిష్కరించున్నారు. ఆ కార్యక్రమానికి ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) ప్రెసిడెంట్ అమోల్ కాలే, సెక్రటరీ అజింక్యా నాయక్, ఇతర అపెక్స్ కౌన్సిల్ సభ్యులు కూడా హాజరుకానున్నారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాకు చెందిన శిల్ప కళాకారుడు ప్రమోద్ కాంబ్లే ఈ విగ్రహాన్ని చెక్కారు. నిజానికి సచిన్ టెండూల్కర్ 50వ జన్మదినం సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాలని గతంలో భావించారు. కానీ అప్పటికీ విగ్రహం పూర్తి కాకపోవడంతో ఆవిష్కరించలేదు. గురువారం వాంఖడే స్టేడియంలో భారత్, శ్రీలంక మ్యాచ్ జరగడానికి ముందు రోజు సచిన్ విగ్రహాన్ని ఆవిష్కరించనుండడం విశేషం.

Updated Date - 2023-11-01T11:06:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising