ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Virat Kohli: కోహ్లీకి కలిసొస్తున్న జనవరి 15.. ఆ రోజున సెంచరీల మోతే!

ABN, First Publish Date - 2023-01-15T21:08:13+05:30

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ (Virat Kohli) మునుపటి ఆటతీరుతో అలరిస్తున్నాడు. కొన్ని సంవత్సరాలపాటు ఫామ్ కోల్పోయి తంటాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువనంతపురం: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ (Virat Kohli) మునుపటి ఆటతీరుతో అలరిస్తున్నాడు. కొన్ని సంవత్సరాలపాటు ఫామ్ కోల్పోయి తంటాలు పడిన కోహ్లీ ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై సెంచరీతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. గాడిలో పడ్డాక మళ్లీ పరుగుల వరద పారిస్తూ ‘రన్ మెషీన్’ బిరుదును సార్థకం చేసుకుంటున్నాడు. ఆ సెంచరీ తర్వాత మరో మూడు సెంచరీలు బాది మొత్తంగా 74 సెంచరీలను తన ఖాతాలో వేసుకున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న ఈ సిరీస్‌లోనే రెండు సెంచరీలు నమోదు చేశాడు.

సంక్రాంతి పండుగ సినిమా హీరోలకే కాదు.. కోహ్లీకి కూడా చాలా ప్రత్యేకమైనది. సంక్రాంతి (Sankaranti)కి విడుదలయ్యే తమ సినిమాలు హిట్ కావాలని హీరోలు కోరుకుంటూ ఉంటారు. అలాగే, జనవరి 15న మ్యాచ్ ఉందంటే ఆ రోజున కోహ్లీ ‘హిట్’లర్‌గా మారిపోతాడు. సెంచరీలతో విరుచుకుపడతాడు. అందుకే జనవరి 15 కోహ్లీకి ప్రత్యేకమైనది. ఈ విషయం చాలాసార్లు రుజువైంది.

జనవరి 15న మ్యాచ్ అంటే కోహ్లీ ఖాతాలో సెంచరీ పక్కా అన్నట్టే. 15 జనవరి 2017లో పూణెలో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో కోహ్లీ శివాలెత్తిపోయాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 105 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 122 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించిపెట్టాడు. కోహ్లీకి అది 27వ సెంచరీ.

ఆ తర్వాతి ఏడాది అంటే 2018లో సెంచూరియన్‌లోని సూపర్ స్పోర్ట్ పార్క్‌లో సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో మూడో రోజు కోహ్లీ 153 పరుగులు చేశాడు. ఆ ఏడాది కోహ్లీ చేసిన తొలి సెంచరీ అదే కాగా, అది కూడా జనవరి 15నే కావడం విశేషం. అయితే, మిగతా బ్యాటర్లు చేతులెత్తేయడంతో ఆ మ్యాచ్‌లో భారత జట్టు 135 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

ఆ తర్వాత 2019లో జనవరి 15నే కోహ్లీ ఖాతాలో మరో సెంచరీ వచ్చి చేరింది. ఈసారి కోహ్లీ ఆస్ట్రేలియాపై ఆ ఘనత సాధించాడు. అడిలైడ్ ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో కోహ్లీ 104 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తాజాగా, ఇప్పుడు శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 166 పరుగులతో చెలరేగాడు. ఈ శతకం కూడా జనవరి 15నే రావడం గమనార్హం. అంటే, జనవరి 15 కోహ్లీకి కలిసొస్తుందన్నమాట. ఆ రోజు మ్యాచ్ ఉంటే శతకం పక్కా అన్న విషయాన్ని నేటి (ఆదివారం) మ్యాచ్‌తో కోహ్లీ నిరూపించాడు. అంటే కోహ్లీ కూడా సంక్రాంతి విన్నరే అన్నమాట!

Updated Date - 2023-01-15T21:08:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising