ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IPL 2024 Auction: వేలం మొదటి దశలో అమ్మకానికి వీళ్లే!

ABN, Publish Date - Dec 19 , 2023 | 11:49 AM

IPL auction: మరికాసేపట్లో ఐపీఎల్ 2024 మినీ వేలం ప్రారంభంకానుంది. 333 మంది ఆటగాళ్లు బరిలో ఉన్న ఈ వేలంలో మొత్తం 10 ఫ్రాంచైజీలు కలిపి రూ.262 కోట్ల వరకు ఖర్చు చేసుకునేందుకు అవకాశం ఉంది.

దుబాయ్: మరికాసేపట్లో ఐపీఎల్ 2024 మినీ వేలం ప్రారంభంకానుంది. 333 మంది ఆటగాళ్లు బరిలో ఉన్న ఈ వేలంలో మొత్తం 10 ఫ్రాంచైజీలు కలిపి రూ.262 కోట్ల వరకు ఖర్చు చేసుకునేందుకు అవకాశం ఉంది. 333 మందిలో 214 మంది భారత ఆటగాళ్లు, 119 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. మొత్తం 333 మందిలో 116 మంది క్యాప్డ్ ప్లేయర్లు కాగా.. 215 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అసోసియేట్ దేశాలకు చెందిన వారున్నారు. మొత్తం 333 ఆటగాళ్లను వారి నైపుణ్యాల ఆధారంగా 19 సెట్‌లుగా విభజించారు. స్పెషలిస్ట్ బ్యాటర్లు, ఆల్ రౌండర్లు, వికెట్ కీపర్లు, ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు, అన్‌క్యాప్డ్ క్రికెటర్లు ఇలా 19 సెట్‌లుగా విభజించారు. తొలి రౌండ్‌లో 5 సెట్ల ఆటగాళ్లకు వేలం నిర్వహిస్తారు. స్టార్ ఆటగాళ్లంతా మొదటి ఐదు సెట్లలోనే ఉంటారు. ఆ తర్వాత ఇతర ఆటగాళ్ల వేలం నిర్వహిస్తారు. ఈ సారి వేలాన్ని మల్లికా సాగర్‌ అనే మహిళ నిర్వహించనున్నారు. ఇటీవల ముగిసిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలాన్ని కూడా ఈమెనే నిర్వహించారు.


అత్యధికంగా రూ.2 కోట్ల బేస్ ధర కల్గిన కేటగిరీ జాబితాలో 23 మంది ప్లేయర్లు ఉన్నారు. ఈ జాబితాలో భారత పేసర్లు శార్దూల్ ఠాకూర్, హర్షల్ పటేల్, ఉమేష్ యాదవ్ ఉన్నారు. 13 మంది ఆటగాళ్లు రూ.1.5 కోట్ల కేటగిరీ జాబితాలో, 11 మంది ఆటగాళ్లు రూ.75 లక్షల కేటగిరీ విభాగంలో, 43 మంది రూ.50 లక్షల విభాగంలో ఉన్నారు. 43 మందిలో 11 మంది భారత ఆటగాళ్లున్నారు. ఆటగాళ్ల వేలం కోసం ప్రస్తుతం ఏ జట్టు దగ్గర ఎంత డబ్బు మిగిలి ఉందనే విషయానికొస్తే చెన్నైసూపర్ కింగ్స్ వద్ద రూ.31.4 కోట్లున్నాయి. ముంబై ఇండియన్స్ వద్ద రూ.17.75 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద రూ.28.95 కోట్లు, పంజాబ్ కింగ్స్ వద్ద రూ.29.1 కోట్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్ వద్ద రూ.34 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ వద్ద రూ.14.5 కోట్లు, లక్నో సూపర్ జెయింట్స్ వద్ద రూ.13.15 కోట్లు, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వద్ద రూ.23.25 కోట్లు, గుజరాత్ టైటాన్స్ వద్ద అందరి కంటే ఎక్కువగా రూ.38.15 కోట్లున్నాయి. చివరగా కోల్‌కతా నైట్ రైడర్స్ వద్ద రూ.32.7 కోట్లు మిగిలి ఉన్నాయి.

Updated Date - Dec 19 , 2023 | 11:49 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising