ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Lovers: ఇద్దరూ చావాలనుకున్నారు కానీ.. విధిరాత వేరేలా ఉందేమో.. గొంతు కోసుకున్నా కూడా ప్రియుడు బతికాడు కానీ..!

ABN, First Publish Date - 2023-10-03T21:08:53+05:30

చాలా మంది ప్రేమికులు తమ ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళ్లాలని అనుకుంటారు. కానీ వివిధ కారణాల వల్ల అది సాధ్యం కాదు. కొన్ని ప్రేమ కథలు మధ్యలోనే విషాదాంతం అవుతుంటాయి. ఎక్కువగా కుటుంబ సభ్యుల కారణంగానే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంటుంది. ఇలాంటి ...

ప్రతీకాత్మక చిత్రం

చాలా మంది ప్రేమికులు తమ ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళ్లాలని అనుకుంటారు. కానీ వివిధ కారణాల వల్ల అది సాధ్యం కాదు. కొన్ని ప్రేమ కథలు మధ్యలోనే విషాదాంతం అవుతుంటాయి. ఎక్కువగా కుటుంబ సభ్యుల కారణంగానే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంటుంది. ఇలాంటి విషాద ఘటనలకు సంబంధించిన వార్తలు రోజూ వింటూనే ఉంటాం. తాజాగా, రాజస్థాన్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ప్రేమికులిద్దరూ చావాలని నిర్ణయించుకున్నారు. ముందుగా ప్రియురాలిని హత్య చేసి.. తర్వాత తానూ గొంతు కోసుకున్నాడు. అయితే యువతి చనిపోయినా యువకుడు మాత్రం బతికాడు. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే..

రాజస్థాన్ (Rajasthan) రాజధాని జైపూర్ (Jaipur) పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన కిషోర్ అనే యువకుడు జ్యోతి అనే యువతి.. కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసుండాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని ఇద్దరూ వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అయితే వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. జ్యోతికి వేరే యువకుడితో వివాహం (marriage) చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. దీంతో యువతి (young woman) ఇదే విషయాన్ని తన ప్రియుడు (boyfriend) కిషోర్‌కు తెలియజేసింది. చివరకు ఇద్దరూ కలిసి చనిపోవాలనే (Suicide decision) షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.

Marriage Video: పెళ్లికి వచ్చిన బంధువులంతా.. ఈ వరుడి వాయిస్ విని షాక్.. పాట పాడుతోంటే వాళ్ల రెస్పాన్స్‌ను మీరే చూడండి..!

చివరకు ఇద్దరూ కలిసి జైపూర్‌ హర్మదా ప్రాంత పరిధి లోహ మండి సమీపంలోకి చేరుకున్నారు. మందుగా జ్యోతిని హత్య చేసిన కిషోర్.. తర్వాత తానూ గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. అయితే గొంతును కొంచెం కట్ చేయగానే అతను అపస్మారక స్థితికి చేరుకున్నాడు. రక్తపుమడుగులో పడి ఉన్న ఇద్దరినీ స్థానికులు గుర్తించి, చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే జ్యోతి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కిషోర్ పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని విచారించారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రియురాలిని హత్య చేసిన కేసులో యువకుడికి జీవిత ఖైదు పడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఓ మహిళకు.. సడన్‌గా వినిపించిందో శబ్దం.. అరుపులు వినిపించిన వైపు వెళ్లి చూస్తే..!

Updated Date - 2023-10-03T21:08:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising