ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: రోడ్డుపై నడుస్తూ వెళ్తున్నాడో వ్యక్తి.. సడన్‌గా పరుగెత్తుకుంటూ వచ్చిన పులి.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..!

ABN, First Publish Date - 2023-12-08T17:54:04+05:30

అదృష్టం బాగోలేకపోతే అరటి పండు తిన్నా పన్ను విరుగుద్ది.. అదే టైం బాగుంటే ఎంత పెద్ద ప్రమాదం నుంచైనా సులభంగా బయటపడొచ్చు. కొందరు చావు అంచుల దాకా వెళ్లి.. క్షేమంగా బయటపడడం చూస్తూనే ఉంటాం. ఇలాంటి...

అదృష్టం బాగోలేకపోతే అరటి పండు తిన్నా పన్ను విరుగుద్ది.. అదే టైం బాగుంటే ఎంత పెద్ద ప్రమాదం నుంచైనా సులభంగా బయటపడొచ్చు. కొందరు చావు అంచుల దాకా వెళ్లి.. క్షేమంగా బయటపడడం చూస్తూనే ఉంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి రోడ్డుపై నడుస్తూ వెళ్తుండగా.. సడన్‌గా పులి పరుగెత్తుకుంటూ వచ్చింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) వైరల్ అవుతోంది. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లో (Uttarakhand) చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కొండ ప్రాంతంలోని పర్యాటక ప్రదేశం వద్ద ఓ వ్యక్తికి ఊహించని అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి రోడ్డు పక్కన నడుస్తూ వెళ్తుంటాడు. అలా కాస్త ముందుకు వెళ్లగానే సడన్‍‌గా ఓ పెద్ద పులి (tiger) రోడ్డు పక్క నుంచి వేగంగా పరుగెత్తుకుంటూ వస్తుంది. దాన్ని ముందే గమనించిన ఆ వ్యక్తి భయంతో వెనక్కు వస్తాడు.

Video: హ్యాట్సాఫ్ బాస్.. మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించావ్.. శునకాలను వెతుక్కుంటూ వెళ్లి మరీ..!

వేగంగా రోడ్డు పైకి వచ్చిన పులి.. ఎక్కడా ఆగకుండా రోడ్డు పక్క నుంచి మరో వైపునకు వెళ్లిపోతుంది. సడన్‌గా పులిని చూసిన ఆ వ్యక్తి వెనక్కు వచ్చి అక్కడున్న వారికి విషయం తెలియజేస్తాడు. దీంతో వారు భయంతో పరుగులు తీస్తారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటివి ఉత్తరాఖండ్‌లో సర్వసాధారణం’’.. అంటూ కొందరు, ‘‘వామ్మో! ఇతడి టైం బాగుంది’’.. అంటూ మరికొందరు, షాకింగ్ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: మిడిల్ ఫింగర్ చూపించిన యాంకర్.. కెమెరాలో రికార్డు అవుతోందని తెలియదంటూ క్షమాపణలు..

Updated Date - 2023-12-08T17:54:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising