ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shocking Video: ఓరి దేవుడో.. ఇదేం వింత.. ఈ కార్లు, బైకులన్నీ ఏమైపోతున్నాయో.. ఎలా మాయమైపోతున్నాయో చెప్పగలరా..?

ABN, First Publish Date - 2023-05-18T20:40:39+05:30

వింతలు, విశేషాలు, అద్భుతాలు, ఆశ్చర్యకర ఘటనలకు సోషల్ మీడియా వేదికగా మారుతోందనడంలో అతిశయోక్తి లేదు. ఎక్కడ ఏ చిన్న విచిత్రమైన ఘటన జరిగినా వెంటనే నెట్టింట సందడి చేస్తుంటుంది. వివాహ కార్యక్రమాల్లో వింత వింత ఘటనలు, స్వతహాగా శత్రువులైన జంతువులు... ఉన్నట్టుండి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వింతలు, విశేషాలు, అద్భుతాలు, ఆశ్చర్యకర ఘటనలకు సోషల్ మీడియా వేదికగా మారుతోందనడంలో అతిశయోక్తి లేదు. ఎక్కడ ఏ చిన్న విచిత్రమైన ఘటన జరిగినా వెంటనే నెట్టింట సందడి చేస్తుంటుంది. వివాహ కార్యక్రమాల్లో వింత వింత ఘటనలు, స్వతహాగా శత్రువులైన జంతువులు... ఉన్నట్టుండి స్నేహం చేయడం, క్రూరమృగాలతో మనుషులు కలిసిపోవడం, అలాగే అదే క్రూరమృగాల బారిన పడి మృత్యువాత పడడం.. ఇలా ఎన్నో ఘటనలకు సంబంధించిన వీడియోలు తెగ చక్కర్లు కొడుతుంటాయి. వీటిలో కొన్ని ఘటనలను చూస్తే.. అరె! ఇదెలా సాధ్యం అని అనిపిస్తుంటుంది. ప్రస్తుతం అలాంటి ఆశ్చర్యకర ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కార్లు, బైకులన్నీ రోడ్డుపై ఉన్నట్టుండీ మాయమైన ఘటన చూసిన వారంతా.. ఇదేం వింత బాబోయ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral video) అవుతోంది. ఓ రహదారిపై చాలా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇందులో ఎలాంటి విశేషం లేకున్నా.. ఉన్నట్టుండి కొన్ని వాహనాలు అదృశ్యం (Vehicles disappear) కావడం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారిపై కొన్ని వాహనాలు నేరుగా వెళ్తుంటాయి. అయితే మరికొన్ని వాహనాలు ఓ బ్రడ్జి వద్దకు రాగానే ములుపు తిరుగుతాయి. ఇంతవరకూ బాగానే ఉన్నా.. మలుపు తిరిగిన వాహనాలన్నీ ఉన్నట్టుండీ మాయమవుతున్నాయి. వాటిలో కార్లు, బైకులతో (Cars and bikes) పాటూ నడుస్తూ వెళ్లే మనుషులు కూడా ఉన్నారు. బ్రడ్జి పక్కనే ఓ కాలువ ఉంటుంది. అదృశ్యమయ్యే వాహనాలన్నీ ఎక్కడి వెళ్తున్నాయో అర్థం కాక.. చూసిన వారంతా వివిధ రకాలుగా ఆలోచిస్తున్నారు. ‘‘ ఈ వాహనాలన్నీ ఎక్కడికి వెళ్తున్నాయో.. ఎవరైనా చెప్పగలరా’’.. అని ప్రస్తావిస్తూ విడియోను షేర్ చేశారు.

Viral Video: బాబోయ్! పడుకున్న మనిషిపై నిప్పు వెలిగించి మరీ మసాజ్.. చివరికి ఏమైందో చూడండి..

ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు (Netizens) వారి వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ‘‘అక్కడ ఉన్న పైకప్పు నదిలా కనిపిస్తోంది’’.. ఒకరు వ్యాఖ్యానించారు. ఇంకొంకరు ప్రస్తావిస్తూ ‘‘మీకు ఎదరుగా కనిపించేంది పైకప్పు.. కావాలంటే బ్రిడ్జికి ఉన్న స్తంభాలు మెరుస్తున్నట్లు చూడొచ్చు.. అలాగే తారు మొత్తం నీరులా కనిపిస్తోంది’’ అని అన్నారు. అలాగే ఇంకొకరు ‘‘కెమెరాను జూమ్ చేసి చూపించడం వల్ల ఇలా కనిపిస్తోంది.. చుట్టు పక్కల ప్రాంతాలను చూపిస్తే అసలు విషయం తెలుస్తుంది’’.. అని ప్రస్తావించారు. అదేవిధంగా మరో వ్యక్తి.. ‘‘అదో సొరంగం.. ఆ వాహనాలన్నీ సొరంగం గుండా వెళ్తున్నాయి’’.. అని పేర్కొన్నారు. మొత్తానికి ఈ వీడియో 30మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Marriage: భర్తకు గుడ్‌బై.. 60 ఏళ్ల వృద్ధుడిని పెళ్లాడిన 28 ఏళ్ల యువతి.. ఈ వయసులో ఇదేం పనని కుటుంబమంతా వ్యతిరేకించినా..!

Updated Date - 2023-05-18T20:40:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising