ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: మండుతున్న పెనం మీద కూర్చుని ఆశీర్వదిస్తున్న బాబా.. విషయం వారికి తెలియడంతో.. చివరికి..

ABN, First Publish Date - 2023-03-25T18:38:29+05:30

బాబాల పేరుతో చాలా మంది చిత్రవిచిత్రమైన పనులు చేయడం చూస్తుంటాం. కొందరు మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి చివరకు కటకటాలకు వెళ్తుంటే.. మరికొందరు అంతా ఆశ్చర్యపోయేలా వివిధ రకాల విన్యాసాలు చేస్తుంటారు. దీంతో వీరికి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

బాబాల పేరుతో చాలా మంది చిత్రవిచిత్రమైన పనులు చేయడం చూస్తుంటాం. కొందరు మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి చివరకు కటకటాలకు వెళ్తుంటే.. మరికొందరు అంతా ఆశ్చర్యపోయేలా వివిధ రకాల విన్యాసాలు చేస్తుంటారు. దీంతో వీరికి ఎక్కడ లేని క్రేజ్ ఏర్పడి.. భక్తులు క్యూకడుతుంటారు. ఇలాంటి బాబాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి బాబాకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఓ బాబా మండుతున్న పెనం మీద కూర్చుని భక్తులను ఆశీర్వదించడం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

మహారాష్ట్ర (Maharashtra) అమరావతి జిల్లా తివాసా తాలూకా మర్ది ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉంటున్న సంత్ గురుదాస్ మహారాజ్ అనే బాబా వద్దకు అనేక మంది భక్తులు (devotees) వస్తుంటారు. గురుదాస్‌కు స్థానికంగా ఓ ఆశ్రమం ఉంది. అందులో అనేక గోవులను (Cows) ఉంచి, వాటి సంరక్షణ బాధ్యతలన్నీ చూసుకుంటూ ఉంటాడు. ఇలావుండగా, ఈ బాబాకు సంబంధించిన వీడియో (Baba Viral Video) ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మండుతున్న పొయ్యి మీద పెనం వేడి చేస్తారు. తర్వాత సదరు బాబా దానిపై కూర్చుంటాడు. పెనం అంత వేడిగా ఉన్నా అతడికి ఏమీ కాకపోవడం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పెనంపై కూర్చున్న గురుదాస్ వద్దకు ఓ వ్యక్తి వచ్చి, పాదాభివందనం చేస్తాడు.

Viral Video: ఈమె డాన్స్‌ చూసి భయపడుతున్న జనాలు.. మరీ మీద మీద పడుతూ ఇదేం డాన్స్‌రా బాబోయ్..

భక్తుని ఆశీర్వదించిన (blessing) బాబా.. ఏమాత్రం చలించకుండా పెనంపై హాయిగా కూర్చుని ఉంటాడు. మరోవైపు పక్కనే ఉన్న వ్యక్తి పొయ్యిలో కట్టెలు పేర్చుతూ ఉంటాడు. ఈ వీడియో వైరల్ అవడంతో స్థానికంగా ఉన్న మూఢనమ్మకాల నిర్మూలన కమిటీ సభ్యులు స్పందించారు. ఇలాంటి మూఢనమ్మకాలను ఎవరూ నమ్మొద్దని, ఒకవేళ అదే నిజమైతే బాబాకు రూ.30లక్షల రివార్డు (30 lakhs reward) అందజేస్తామని సవాల్ విసిరారు. కాగా, ఈ సవాల్‌పై గురుదాస్ మహారాజ్ స్పందించారు. తాను మూఢనమ్మకాలతో (Superstitions) పని చేయడం లేదన్నారు. గోసంరక్షణే ధ్యేయంగా పని చేస్తున్నానని, తనలో దైవ శక్తి ఉందని చెప్పాడు. అయితే తాను సాధువును కానంటూ వివరించాడు. మొత్తానికి పొయ్యి మీద కూర్చున్న బాబా వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Viral news: టాటూ ఆర్టిస్టు వద్దకు వెళ్లిన ప్రియురాలు.. ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో కాసేపటికి ప్రియుడు వెళ్లి చూడగా..

Updated Date - 2023-03-25T18:38:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising